
హైదరాబాద్, జనవరి 14: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఏపీ సెట్ రాత పరీక్షల తేదీలు తాజాగా విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.
సెట్ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.1600, బీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇతరులు రూ.900 చెల్లించవల్సి ఉంటుంది. హాల్ టికెట్లను మార్చి 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ నుంచి పూర్తి సమాచారం పొందవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘సీయూఈటీ పీజీ – 2026’ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు బుధవారం (జనవరి 14)తో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా జనవరి 14వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓ ప్రకటనలో తేలిపింది. మొత్తం 157 సబ్జెక్టులో ఈ పరీక్షను రెండు పేపర్లకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.