AP Anganwadi jobs: రాత పరీక్షలేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 110 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పుట్టపర్తిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 110 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీల భర్తీకి..

AP Anganwadi jobs: రాత పరీక్షలేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 110 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు..
AP Anganwadi jobs

Updated on: Jan 05, 2023 | 8:55 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పుట్టపర్తిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 110 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళ అయ్యి ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తులు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ అర్హతలున్నవారు జనవరి 6, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేసిన దరఖాస్తులను అదే ఆఫీస్‌లో అందజేయాలి. పదో తరగతిలో పొందిన మార్కులను బట్టి తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ జనవరి 11న ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ.11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us