AP DSC 2025 Hall Ticket: వాయిదాపడిన ఆ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే..! హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేశారా..?

మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అయితే గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ఆంటే ఈ రోజుతో పరీక్షలు ముగియవల్సి ఉంది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా..

AP DSC 2025 Hall Ticket: వాయిదాపడిన ఆ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే..! హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేశారా..?
Mega DSC Revised Hall Ticke

Updated on: Jun 30, 2025 | 2:22 PM

అమరావతి, జూన్‌ 30: రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అయితే గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ఆంటే ఈ రోజుతో పరీక్షలు ముగియవల్సి ఉంది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను కూటమి సర్కార్‌ వాయిదా వేసింది. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చుతున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ క్రమంలో మారిన పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు, తేదీలను మార్చిన కొత్త హాల్‌ టికెల్‌ట్లను విద్యాశాఖ విడుదల చేసింది. వాటిని జూన్‌ 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ తేదీల్లో పరీక్షలు రాయవల్సిన అభ్యర్థులు వెంటనే వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. దీంతో జూలై 2వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించాలని మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ఏపీతో సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా జరుగుతున్నాయి. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తులు దాదాపు 5,77,675 వరకు వచ్చాయి. వీరందరికీ దాదాపు 154 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలు వచ్చేశాయి. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి.. అనంతరం వెనువెంటనే తుది ఆన్సర్‌ కీ కూడా విడుదల చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.