AP Inter Supply Recounting: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటిక్‌, రీవెరిఫికేషన్‌కు ఛాన్స్.. నేటి నుంచే ప్రారంభం

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 45 శాతం, సెకండ్ ఇయర్‌లో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి రీకౌంటిక్‌, రీవెరిఫికేషన్‌కు..

AP Inter Supply Recounting: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటిక్‌, రీవెరిఫికేషన్‌కు ఛాన్స్.. నేటి నుంచే ప్రారంభం
AP Inter Supply Recounting and Reverification

Updated on: Jun 09, 2025 | 10:21 AM

అమరావతి, జూన్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 45 శాతం, సెకండ్ ఇయర్‌లో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఫస్ట్ ఇయర్‌లో 1,27,182 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. వీరిలో 57,400 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండ్‌ ఇయర్‌లో 87,793 మంది పరీక్ష రాయగా.. ఇందులో 55,210 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్రంలో ఈసారి ఫస్ట్‌ ఇయర్‌లో 2,30,303 మంది ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాశారు. వీరిలో 1,90,038 మందికి అంటే 83 శాతం మందికి మార్కులు పెరిగాయి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలతో కలిపి ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన పబ్లిక్‌ పరీక్షలు, సప్లిమెంటరీ కలిపి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 4,87,295 మంది పరీక్షలు రాశారు. మార్చిలో 3,42,979, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 57,400 మంది కలిపి మొత్తం 4,00379 అంటే 82.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో 4,22,030 మంది పరీక్ష రాయగా 3,93,976 అంటే 93.35 శాతం మంది పాస్‌ అయ్యారు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 76 శాతం, సెకండియర్‌లో 91 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీలో ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలురు 43 శాతం, బాలికలు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలురు 63 శాతం, బాలికలు 63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూన్‌ 9 నుంచి 13 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1300, రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.260 చొప్పున చెల్లించాలని సూచించారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.