
అమరావతి, మే 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి విద్యార్ధులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, విద్యార్ధులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. విద్యార్ధులు వెబ్‌సైట్‌తోపాటు ‘మన మిత్ర’ వాట్సప్ యాప్ 95523 00009 నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష , జూన్ 6న పర్యావరణ విద్య నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ 2025 పరీక్షల పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.