AP DSC Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి తర్వాత ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌!

|

Jan 14, 2024 | 9:39 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం (జనవరి 13) తెలియజేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న డీఎస్సీ ఖాళీల గురించి చర్చించినట్లు తెలిపారు. మొత్తం పోస్టుల సంఖ్య, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని..

AP DSC Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి తర్వాత ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌!
Minister Botsa Satyanarayana
Follow us on

అమరావతి, జనవరి 14: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం (జనవరి 13) తెలియజేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న డీఎస్సీ ఖాళీల గురించి చర్చించినట్లు తెలిపారు. మొత్తం పోస్టుల సంఖ్య, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి బొత్స అన్నారు

మంగళూరు రిఫైనరీలో 27 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులోని ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌)లో ఈ2 గ్రేడులో 27 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023 స్కోరు సాధించిన వారు అర్హులు. దరఖాస్తుదారుల వయోపరిమితి తప్పరిసరిగా 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 12, 2024గా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.118 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అకడమిక్‌ మెరట్‌, గేట్-2023 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్‌ చెక్‌ చేయండి.

మంగళూరు రిఫైనరీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో 1100 జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275, ఎలక్ట్రీషియన్- 275, ఫిట్టర్- 550 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత విభాగంలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. జనవరి 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధుల వయసు జనవరి 16, 2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.22,528 జీతంగా చెల్లిస్తారు.

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.