Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన.. గ్లోబల్ లీడర్లు వచ్చేస్తున్నారోచ్‌!

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన లక్ష మంది అత్యుత్తమ క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల్ని తయారు చేయాలన్న లక్ష్యాన్ని ఇది సాకారం చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ఏపీని గమ్య స్థానంగా ఇది మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు..

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన.. గ్లోబల్ లీడర్లు వచ్చేస్తున్నారోచ్‌!
AP CM hails huge response to quantum skilling course

Updated on: Jan 20, 2026 | 2:38 PM

అమరావతి, జనవరి 18: అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్ష వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ కోర్సు నేర్చుకునేందుకు గానూ 50 వేల మంది నమోదు చేసుకోవటంపై సీఎం ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసేలా సంకల్పం చేశామని పేర్కోన్నారు. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ పీటీఈఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సు నేర్చుకునేందుకు ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావటం ఆనందాన్ని ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన లక్ష మంది అత్యుత్తమ క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల్ని తయారు చేయాలన్న లక్ష్యాన్ని ఇది సాకారం చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ఏపీని గమ్య స్థానంగా ఇది మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు. క్వాంటం కంప్యూటింగ్ స్కిల్లింగ్ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే నిపుణులను స్వయంగా సత్కరించేందుకు ఎదురు చూస్తుంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్వాంటం రంగంలో వారే గ్లోబల్ లీడర్లుగా ఎదిగేందుకు ఆస్కారముందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

IIT మద్రాస్, IBM రీసెర్చ్ కలిసి NPTEL ద్వారా నిర్వహించిన అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్స్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి 50 వేల మందికి పైగా నమోదు చేసుకున్నీరు. క్వాంటం టెక్నాలజీపై రాష్ట్ర యువతలో ఆసక్తి పెరగడం సంతోషం. లక్ష మంది క్వాంటం ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే లక్ష్యం దిశగా అడుగు వేస్తున్నాంజ ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో క్వాంటం నిపుణుల తయారీపై ఫోకస్ పెడుతున్నాం. క్వాంటం రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. దీర్ఘకాల పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యంగా మారుతోంది. కోర్సులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిని స్వయంగా అభినందిస్తానని సీఎం చంద్రబాబు ఈ మేరకు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.