Layoffs: అనుకున్నదాని కంటే ఎక్కువే.. ఆర్థికమాంద్యం సెగకు విలవిలలాడుతోన్న వేలాది మంది ఉద్యోగులు.

|

Dec 07, 2022 | 7:18 AM

వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఆ సెగ మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తోంది. కార్పొరేట్‌ ఐటీ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను ఇంటికి పంపడమే..

Layoffs: అనుకున్నదాని కంటే ఎక్కువే.. ఆర్థికమాంద్యం సెగకు విలవిలలాడుతోన్న వేలాది మంది ఉద్యోగులు.
Layoffs
Follow us on

వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఆ సెగ మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తోంది. కార్పొరేట్‌ ఐటీ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను ఇంటికి పంపడమే పనిగా పెట్టుకున్నాయి. అమెజాన్‌ తొలుత 10 వేల మందిని తొలగించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం పెరనుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ బడా ఆన్‌లైన్‌ ఈ కమార్స్‌ కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఏకంగా 20 వేల మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం. పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మేనేజర్లను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక మాంద్యం అంచనాల నేపథ్యలో ఖర్చులను తగ్గించుకునేందుకే అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ సమయంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌కు డిమాండ్‌ పెరగడంతో కంపెనీ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పురావడంతో ఖర్చులను మిగుల్చుకునే ఉద్దేశంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఈ నెలాఖరు లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం అమెజాన్‌ చరిత్రలోనే తొలిసారి అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరో ప్రముఖ కంపెనీ కూడా..

ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపు కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర పరిశ్రమలపై కూడా ప్రభావం పడుతోంది. తాజాగా ప్రముఖ కూల్‌ డ్రింక్స్‌ తయారీ సంస్థ పెప్సీకో కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ కంపెనీ తన ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టింది. వాల్‌ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. పెప్సికో తన ప్రధాన కార్యాలయంలోని ఉత్తర అమెరికా స్నాక్, పానీయాల యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం టెక్‌ కంపెనీల్లో జరుగుతోన్న ఉద్యోగుల తొలగింపు కంటే ఎక్కువగా లేఆఫ్స్‌ ఉండనున్నాయని కంపెనీ సంకేతాలు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..