AICTE: ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజును ఖరారు చేసిన ఏఐసీటీఈ.. కనీస ఫీజు ఎంతో తెలుసా.?

|

May 19, 2022 | 12:00 PM

AICTE: దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీ) ఖరారు చేసింది. ఇంజీనింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ట ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను...

AICTE: ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజును ఖరారు చేసిన ఏఐసీటీఈ.. కనీస ఫీజు ఎంతో తెలుసా.?
Follow us on

AICTE: దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీ) ఖరారు చేసింది. ఇంజీనింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ట ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యా శాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కళాశాలల్లో కనీస ఫీజు రూ. 79,600గా, గరిష్ట ఫీజును రూ. 1.89 లక్షలుగా నిర్ణయించారు. 2015లో బోధన ఫీజులను నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే.

ఈ కమిటీ గతేడాది ఆగస్టులో కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించి, సమీక్షించేందుకు మరో ఉప కమిటీని నియమించింది. తాజాగా తుది నివేదికను ఏఐసీటీఈ విడుదల చేసింది. ఇక పీజీ పీజీ కోర్సులకు కనిష్ఠంగా రూ.1,41,200, గరిష్ఠంగా రూ.3,04,000గా నిర్ణయించారు. ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులకు కనిష్ఠ ఫీజు రూ.67,900, గరిష్ఠ ఫీజు రూ.1,64,700గా నిర్ణయించారు. మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఏడాదికి రూ.85వేల నుంచి రూ.1,95,200 వరకు ఫీజులు ఉండవచ్చన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఫీజులు అమలు చేయాలని ఏఐసీటీ పేర్కొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..