భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 906 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 11, 2023వ తేదీ నాటికి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపికైన వారు చెన్నై, కోల్‌కతా, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇందౌర్, అమృత్‌సర్, భువనేశ్వర్, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, అగర్తల, సూరత్, లేహ్ శ్రీనగర్, పట్నా, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, దేహ్రాదూన్, పుణెలలో ఏదైనా ఓ చోటికి పోస్టింగ్‌కు వెళ్లవలసి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 8, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ణయించారు. అప్లికేషన్ పూర్తిచేసే సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.750లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డిగ్రీ మార్కులు, ఐ/కలర్ బ్లైండ్‌నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష, రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000 లు, రెండో ఏడాది నెలకు రూ.32,000, మూడో ఏడాది నెలకు రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.