మరో 12th ఫెయిల్‌ స్టోరీ.. 12 సార్లు UPSC సివిల్స్ పరీక్ష రాస్తే.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్‌!

ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు నియామకాల్లో గెలుపొందడం అంత సులువు కాదు. నిరుద్యోగుల సహానికి అగ్నిపరీక్ష.. మహా తపస్సు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షో గట్టెక్కడమనేది ఎంతోమంది అభ్యర్థుల కల. అయితే దీన్ని సాధించటం అంత తేలికకాదు. లక్షల మంది ప్రిలిమ్స్‌ రాస్తే.. వడపోతలో చివరకు వందల్లోనే ఎంపికవుతారు..

మరో 12th ఫెయిల్‌ స్టోరీ.. 12 సార్లు UPSC సివిల్స్ పరీక్ష రాస్తే.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్‌!
12 Attempts UPSC Aspirant Kunal R Virulkar story

Updated on: Nov 14, 2025 | 7:47 PM

యూపీఎస్సీ ఆధ్వరంలో నిర్వహించే ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు నియామకాల్లో గెలుపొందడం అంత సులువు కాదు. నిరుద్యోగుల సహానికి అగ్నిపరీక్ష.. మహా తపస్సు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షో గట్టెక్కడమనేది ఎంతోమంది అభ్యర్థుల కల. అయితే దీన్ని సాధించటం అంత తేలికకాదు. లక్షల మంది ప్రిలిమ్స్‌ రాస్తే.. వడపోతలో చివరకు వందల్లోనే ఎంపికవుతారు. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ అవసరం. అయినా యేటా లక్షలాది మంది ఈ పరీక్ష రాసి తమ అదృష్టాన్ని పరీక్షంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 2023లో 12th ఫెయిల్‌ అనే మువీ కూడా వచ్చింది. ఈ సినిమాలో హీరో మనోజ్ కుమార్ శర్మ ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరి అటెంప్ట్‌లో విజయం సాధిస్తాడు. కానీ నిజ జీవితంలో ఓ వ్యక్తి ఏకంగా 12 సార్లు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాశాడు. ఇందులో ఏడు సార్లు ప్రిలిమ్స్‌లో గట్టెక్కి మెయిన్స్ వరకూ వెళ్లాడు. ఐదు సార్లు మెయిన్స్‌లో విజయం సాధించి ఇంటర్వ్యూలకు సైతం హాజరయ్యాడు. కానీ గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు. అతడే కునాల్ ఆర్ విరుల్కార్.

కునాల్ విరుల్కార్ సివిల్‌ సర్వీసెస్‌ ప్రయాణం 2012లో ప్రారంభమైంది. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. ఆ తర్వాత 2013లో తొలిసారి ప్రిలిమ్స్‌ గట్టెక్కారు. అయితే మెయిన్స్‌లో చుక్కెదురైంది. 2014లోనూ ఇదే పరిస్థితి. కానీ 2015లో తొలిసారి మెయిన్స్‌లో కూడా క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. కానీ కేవలం 52 మార్కుల తేడాతో వెనుదిరిగాడు. లక్ష్యానికి దగ్గరగా వచ్చానన్న ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి

అయితే 2016, 2017లో కనీసం ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేకపోయాడు. అయినా కునాల్ ఉత్సాహం కోల్పోకుండా 2018లో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ గట్టెక్కి ఇంటర్వ్యూకి వెళ్లాడు. అయితే కేవలం ఒక్క మార్కుతో మళ్లీ వెనుదిరిగాడు. మళ్లీ 2019లో ప్రయత్నిస్తే ప్రిలిమ్స్‌లో గట్టెక్కలేదు. పట్టువదలకుండా మళ్లీ 2020లో అన్నీ గట్టెక్కి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఈసారి 10 మార్కుల తేడాతో విధి మళ్లీ వెక్కిరించింది. ధైర్యం కూడదీసుకుని 2021లో మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి 16 మార్కుల తేడాతో వెనుదిరిగాడు. 2022లో ప్రిలిమ్స్‌లోనే చతికిలపడ్డాడు. చివరిగా 2023లో మరో ప్రయత్నం చేశాడు. ఈసారి 9 మార్కుల తేడాతో వెనుదిరిగాడు.

అలా.. కునాల్ ఏకంగా 12 ప్రయత్నాలు చేస్తే.. 7 సార్లు ప్రిలిమ్స్‌లో గట్టెక్కి, 5 సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాడు. కానీ ఒక్కసారి కూడా విజయం అతడిని పలకరించలేదు. 2023లో ఫలితాలు విడుదలైన సమయంలో కునాల్ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జీవితమంటేనే పోరాటం.. అంటూ ఒక్క వాక్యంలో తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అది అతని ఓటమి పెట్టిన పొలికేక కాదు. అదొక నిశ్శబ్ధ ప్రకటన. ప్రపంచం దాన్ని విన్నది. మన జీవితాలు మనం చేరుకునే చివరి గమ్యస్థానాల ద్వారా మాత్రమే విలువకట్టబడతాయి. అలాంటిదే కునాల్ కథ కూడా. ఇది ఒక శక్తివంతమైన జ్ఞాపిక. అతను ఒక ఇంజనీర్. ఒక గురువు. అతను తన పన్నెండేళ్ల ప్రయాణంలో పొందిన జ్ఞానం, అనుభవంతో అతని పాత్ర నిండిపోయింది. ఇక్కడ కునాల్‌ జీవితం మనందరికీ ఓ పాఠాన్ని నేర్పుతుంది. ఫలితాన్ని మాత్రమే కాదు, ప్రయత్నాన్ని కూడా సెలబ్రేట్‌ చేసుకోగలగాలి. అన్ని సార్లు గెలుపొందినవారేకాదు.. కొన్నిసార్లు ఎక్కడం ఎప్పుడూ ఆపని వ్యక్తులు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరేమంటారు.. నిజమేనా?

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.