హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికిగానూ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను మంత్రి భట్టి విక్రమర్క సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి భట్టి పేర్కొన్నారు. అలాగే జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేడెట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.