ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఉద్యోగానికి వింత జాబ్ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందుకు సంబంధించి సీఈఓ గోయల్ అధికారిక ప్రకటన చేశారు. సాధారణంగా ఉద్యోగం అంటే కంపెనీ మనకు శాలరీ చెల్లిస్తుంది. కానీ ఈ ఆఫర్‌లో అభ్యర్థే ఏకంగా రూ. 20 లక్షలు చెల్లించాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి రెజ్యూమ్ కూడా అందించాల్సిన అవసరం లేదని ఒక నిబంధన విధించింది. ఇంతకీ రూ. 20 లక్షలు చెల్లించడం ఏంటి.? రెజ్యూమ్ అవసరం లేకపోవడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారు కదూ! ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి జీతం అంధించారు. ఎంపికైన అభ్యర్థి గురుగ్రామ్‌లోని జొటామో మెయిన్ ఆఫీస్‌లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అయితే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి రూ. 20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు డొనేట్ చేయాలని తెలిపారు. అయితే ఒకవేళ ఉద్యోగి కోరితే జొమాటో కూడా 50 లక్షలు తన తరఫున ఎన్జీఓవకు విరాళంగా అందిస్తుందని గోయల్ తెలిపారు. ఇక మొదటి ఏడాది ఎలాంటి జీతం ఉండదని రెండో ఏడాది నుంచి ఏడాదికి రూ. 50 లక్షల ప్యాకేజీతో జీతం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడాని రెజ్యూమ్ కూడా పంపాల్సిన అసరం లేదని కేవలం 200 పదాల్లో మీ గురించి చెబుతూ d@zomato.comకు నేరుగా మెయిల్ పంపాలని తెలిపారు.
Update: I am looking for a chief of staff for myself. pic.twitter.com/R4XPp3CefJ
— Deepinder Goyal (@deepigoyal) November 20, 2024
ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల కోసం పని చేయాల్సి ఉంటుంది. దీపిందర్ గోయల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై భిన్న వాదనాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 20 లక్షలు చెల్లించడం ఏంటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉండి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..