అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెల రైతుల ఖాతాల్లోకి రూ.3 వేలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు పలు రకాల పథకాలు అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాలలో చేరితే

అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెల రైతుల ఖాతాల్లోకి రూ.3 వేలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Farmers

Updated on: May 13, 2021 | 4:58 PM

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు పలు రకాల పథకాలు అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాలలో చేరితే అనేక రకాల బెనిఫిట్స్ అందుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి నెలా రూ. 3 వేలు లభిస్తాయి. ఈ పథకంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందామా.  pm kisan maan dhan scheme

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీం ద్వారా రైతులకు ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. కానీ ఈ డబ్బులు మాత్రం 60 ఏళ్ళ తర్వాతనే ప్రతి నెలా చేతికి అందుతాయి. అంతేకాకుండా…. రైతులు ఈ పథకంలో చేరితో ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి. పీఎం కిసాన్ పథకంలో చేరిన రైతులు మరింత సులభంగానే ఈ స్కీంలో చేరవచ్చు. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేకుండా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు చేరోచ్చు. ఒక వేళ మీరు రూ. 3 వేలు పొందాలని భావిస్తే.. నెలకు రూ. 55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే మొత్తం కూడా మారుతుంది. ఇక ఈ పథకంలో ఆన్ లైన్ ద్వారా చేరొచ్చు. ఇందుకోసం ముందుగా పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు దగ్గరిలోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి మాన్ ధన్ యోజన పథకంలో చేరొచ్చు. పీఎం కిసాన్ పథకంలో చేరని వారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వంటి డాక్యుమెంట్లను తీసుకొని వెళ్లి రిజిస్టర్ కావచ్చు.

Also Read: మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Loading...
Unable to load recommendations.
Follow Us