Business Ideas: తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్.. బ్యాంక్ లోన్ ఇలా పొందండి..

|

Jan 04, 2023 | 6:17 PM

Business Ideas: చాలామంది ఉద్యోగానికంటే వ్యాపారమే మంచిదని భావిస్తున్న రోజులివి. ఉద్యోగం చేస్తే లభించే వేతనం కంటే వ్యాపారంలో వచ్చే ఆదాయం ఎక్కువుగా ఉంటుందని కొందరు, మరొకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి..

Business Ideas: తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్.. బ్యాంక్ లోన్ ఇలా పొందండి..
Jam Jelly Murabba Business
Follow us on

Business Ideas: చాలామంది ఉద్యోగానికంటే వ్యాపారమే మంచిదని భావిస్తున్న రోజులివి. ఉద్యోగం చేస్తే లభించే వేతనం కంటే వ్యాపారంలో వచ్చే ఆదాయం ఎక్కువుగా ఉంటుందని కొందరు, మరొకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందవచ్చని మరికొందరు ఇలా వ్యాపారంపై మక్కువు చూపిస్తుంటారు. అయితే వ్యాపారం చేయడం అంత సులభం కాదు. పెట్టుబడి పెట్టాలి. కొన్నిసార్లు నష్టాలు వచ్చినా తట్టుకునే ఆర్థికశక్తి, సామర్థ్యం అవసరం. ఓ విధంగా చెప్పాలంటే బిజినెస్‌ రిస్క్‌తో కూడుకున్నది. దీంతో కొంతమంది వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నా.. పెట్టుబడి లేకపోవడం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లోనే ఉండి తక్కువ ఖర్చుతో ప్రారంభించి ఎక్కువ లాభాలు పొందే వ్యాపార చిట్కాలు తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే తక్కువ ఖర్చుతో ఇంటి నుండి జామ్, జెల్లీ, మురబ్బా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రతి సీజన్‌లోనూ దీనికి డిమాండ్‌ ఉంటుంది. అందుకే ఈ వ్యాపారం ద్వారా ఏడాది పొడవునా సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో మోసాలు, నష్టపోయే ఛాన్స్ తక్కువుగానే ఉంటుందని వ్యాపార నిపుణుల అంచనా. ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 18 నుండి 20 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. మొదట్లో పెద్దగా ఈ బిజినెస్‌ ప్రారంభిచడం భయంగా ఉంటే.. ఇంటి నుండి కూడా ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. ఎప్పుడైతే మంచి డిమాండ్ ఉంటుందో.. అప్పుడు ఈ వ్యాపారాన్ని పెద్ద మొత్తంలో చేయవచ్చు.

జామ్, జెల్లీ తయారీ వ్యాపారానికి మొదట మీ ఉత్పత్తిని తయారు చేయడానికి పండ్లు అవసరం. జామ్‌లు, జెల్లీలకు పండ్లతోపాటు.. దీన్ని తయారు చేయడానికి చక్కెర, పెక్టిన్ అవసరం. ఇంట్లో కూర్చొని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు.

ఖర్చు, లాభం..

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నివేదిక ప్రకారం, జామ్, జెల్లీ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 8 లక్షల రూపాయలు అవసరమవుతుంది. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ షెడ్డును తయారు చేసేందుకు దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు. అదే సమయంలో కొన్ని యంత్రాలు కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.4.5 లక్షలు అవసరమవుతాయి. ఇది కాకుండా దాదాపు రూ.1.5 లక్షల వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

ప్రతి నెలా 17 వేల రూపాయలు సంపాదన

కెవిఐసి నివేదిక ప్రకారం రూ.8 లక్షల పెట్టుబడితో ఏటా 231 క్వింటాళ్ల జామ్, జెల్లీ తయారు చేయవచ్చు. క్వింటాల్‌కు రూ.2200 ప్రకారం మీరు చేసే ఉత్పత్తుల మొత్తం ధర రూ.5,07,600 వరకు ఖర్చు అవుతుంది. అదే సమయంలో, దానిని విక్రయించిన తర్వాత, మీరు దాదాపు రూ.7,10,640 పొందుతారు. అంటే మీరు దాదాపు రూ. 2,03,040 లాభం పొందుతారు. ఈ విధంగా మీరు ప్రతి నెలా 17 వేల రూపాయలు సంపాదిస్తారు.

ముద్రా పథకం కింద రుణ సదుపాయం

ఈ వ్యాపారం కోసం బిల్డింగ్‌ నిర్మాణం ఖర్చు భారం అవుతుందనుకుంటే మొదట్లో ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. ఒకవేళ భవనంసొంతదైతే ఖర్చు తగ్గుతుంది, దీని కారణంగా మీ లాభం గణనీయంగా పెరుగుతుంది. ప్రారంభంలో మీరు వ్యాపారం ప్రారంభించడంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ప్రభుత్వం అమలు చేసే ముద్ర రుణ పథకం సహాయం తీసుకోవచ్చు. దీనితో, మీరు తక్కువ వడ్డీ రేటుతో సులభంగా రుణం పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..