Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!

భారత ప్రభుత్వం ఉజ్వల పథకం కింద దేశంలోని నిరుపేదలకు గ్యాస్‌ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రజలు కట్టెలకు బదులుగా గ్యాస్‌ సిలిండర్లని వినియోగిస్తున్నారు.

Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!
ఇదే కాకుండా గ్యాస్ సిలింగడర్ రెండ్ కలర్‌లో ఉండడం సైన్స్‌తో కూడా ముడిపడి ఉంది. ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఇతర రంగులను గుర్తించడం కొంత కష్టంగా ఉన్నా ఎరుపు రంగులను గుర్తించడం సులభం.

Edited By:

Updated on: Feb 11, 2023 | 9:21 AM

భారత ప్రభుత్వం ఉజ్వల పథకం కింద దేశంలోని నిరుపేదలకు గ్యాస్‌ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రజలు కట్టెలకు బదులుగా గ్యాస్‌ సిలిండర్లని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే చాలానే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. గ్యాస్ కంపెనీ సంబంధిత బ్రాంచ్‌కి వెళ్లి గంటల తరబడి లైన్లో నిలబడి గ్యాస్ సిలిండర్లని బుక్ చేసుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్‌పిజి సిలిండర్ల బుకింగ్‌లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చుని ఎల్పీజీ సిలిండర్‌ను నాలుగు పద్దతుల్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.?

ఫోన్‌ కాల్ ద్వారా..

మీరు మీ మొబైల్ ద్వారా గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సులభంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు సదరు గ్యాస్ కంపెనీకి సంబంధించిన ట్రోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. మీ గ్యాస్ బుక్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా సిలిండర్ ఈజీగా బుక్‌ అవుతుంది. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎంఎస్ ద్వారా..

మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. దీని కోసం మీరు గ్యాస్ ఏజెన్సీ పేరు, పంపిణీదారుడి పేరు, ఫోన్ నెంబర్, STD కోడ్, సిటీ కోడ్, IVRS నెంబర్‌ను నమోదు చేసి సదరు గ్యాస్ కంపెనీ నెంబర్‌కి పంపాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయ్యాక గ్యాస్ బుక్ అయినట్లు మీ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. తర్వాత 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ వస్తుంది.

అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా..

మీ గ్యాస్‌ సిలిండర్‌‌ను ఇంట్లో కూర్చునే గ్యాస్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మీరు సదరు కంపెనీ అఫీషియల్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. అకౌంట్ ఉంటే లాగిన్ క్రెడిన్షియల్స్ ద్వారా లేదా రిజిస్టర్ చేసుకుని.. ఆ తర్వాత ‘బుక్ యుర్ సిలిండర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. గ్యాస్ బుక్ నెంబర్, మీ పేరు, చిరునామా తదితర వివరాలను నింపాలి. తద్వారా మీ గ్యాస్ బుకింగ్ పూర్తి అవుతుంది. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

Whatsapp ద్వారా..

వాట్సప్ ద్వారా కూడా గ్యాస్‌ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి 7588888824 టోల్‌ఫ్రీ నెంబర్‌కు మీ సిలిండర్ వివరాలను వాట్సాప్ చేయాలి. తర్వాత మీ గ్యాస్ సిలిండర్ బుక్‌ అవుతుంది. అనంతరం ఇంటికి డెలివరీ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం