IRCTC Tickets: మీరు కుటుంబం మొత్తం కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటారు. ప్రతి రోజు ఈ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా లక్షలాది టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే ఐఆర్‌సీటీసీ అకౌంట్ నుంచి ప్రతి నెలకు 12 టికెట్లను బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతిస్తుంది. గతంలో ఐఆర్‌సీటీసీ నుంచి కేవలం 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు వెసులుబాటు ఉండేది. కానీ ఈ సంఖ్యను ఇప్పుడు పొడిగించింది ఐఆర్‌సీటీసీ. అయితే మీరు రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంట ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.
ఐఆర్‌సీటీసీకి ఆధార్ లింక్ చేయడం ఎలా..?
► ముందుగా ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ www.irctc.co.in లింక్‌పై ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ కనిపించే అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
► ఎగువన మెనులో అకౌంట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లింక్ యువర్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
► అపై ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని నమోదు చేయాలి.
► చెక్ బాక్స్‌ను ఎంచుకుని ఓటీపీపై క్లిక్ చేయాలి.
► మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరించాలి.
► ఇప్పుడు ఆధార్ నుంచి అందుకున్న కేవైసీని తనిఖీ చేయండి. ఆధార్ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి అప్‌డేట్ బటన్‌పై క్లిక్ చేయండి.
కేవైసీ, ఆధార్ ఐఆర్‌సీటీసీకి లింక్ చేయబడిన తర్వాత మీ స్క్రీన్‌పై నిర్ధారణ సందేశం కనిపిస్తుంది.
► ఇక లాగ్ ఔట్ చేసిన తర్వాత మళ్లీ ఐఆర్‌సీటీసీ లాగిన్ కావాలి.
► మీ ఆధార్ కేవైసీ స్థితిని తెలుసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్‌ను లింక్ అయిన విషయాన్ని తనిఖీ చేసుకోవచ్చు.