
కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రవేశించాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక లావాదేవీల పరంగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా వచ్చాయి. వాటిల్లో ఒకటి కొత్త ఆదాయ పన్ను విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మధ్యంతర బడ్జెట్ సెషన్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. దీనిలో పన్ను స్లాబ్‌లతో పాటు రాయితీలకు సంబంధించిన పన్ను రేట్లు కూడా మారాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏఓపీలు) సహా పన్ను చెల్లింపుదారులందరికీ కొత్త పన్ను విధానం వర్తిస్తుంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారుల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలోకి మారడం వల్ల పన్ను మినహాయింపులు ఉండవేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమేనా? కొత్త పన్ను విధానంలోకి మారడం వల్ల ప్రయోజనం ఉండదా? పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉండదా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కొత్త పన్ను విధానంలోకి మారడం వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో పలువురు పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కొత్త పన్ను విధానం కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. దానిని ఎంచుకోవడం ద్వారా పన్ను మినహాయింపులను పొందొచ్చని వివరిస్తున్నారు. ఈ తగ్గింపుల వల్ల పన్ను చెల్లింపుదారులకు లక్షలాది రూపాయలు ఆదా అవుతుందంటున్నారు. కొత్త పన్ను విధానంలో అటువంటి పన్ను మినహాయింపులలో కొన్నింటిని చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..