Ambani House: మీరు అంబానీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? కేవలం రూ.2తోనే చూడొచ్చు!
Mukesh Ambani House: ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని విలువ దాదాపు రూ.15,000 కోట్లు. ఈ 27 అంతస్తుల భవనం 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల థియేటర్, స్విమ్మింగ్ పూల్..

మీరు కూడా ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోవచ్చు. అది కూడా కేవలం 2 రూపాయలలోనే. ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ పూర్వీకుల ఇంటిని సందర్శించవచ్చు. గుజరాత్‌లోని చోర్వాడ్‌లో ఉన్న ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్. ఒకప్పుడు ముఖేష్ అంబానీ, అతని కుటుంబం పూర్వీకుల నివాసం. ఇప్పుడు ప్రజల కోసం అందుబాటులో ఉంది. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తమ బాల్యాన్ని గడిపిన ప్రదేశం ఇదే. దాదాపు 100 సంవత్సరాల నాటి ఈ ఇంటి ధర దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.
పూర్వీకుల ఇల్లు గుజరాత్‌లో ఉంది:
గతంలో అంబానీ కుటుంబ వ్యక్తిగత నివాసంగా ఉన్న ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఈ రెండంతస్తుల భవనం గుజరాతీ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇంటిలోని ప్రతి మూల అంబానీ కుటుంబం విజయాల కథను చెబుతుంది. దీనికి చెక్కతో చెక్కబడిన కిటికీలు, ప్రాంగణం, అందమైన తోట ఉన్నాయి. ఈ ఇల్లు ధీరూభాయ్ అంబానీ తండ్రి హీరాచంద్ గోర్ధన్‌భాయ్ అంబానీకి చెందినది. అలాగే ఇక్కడి నుండే అంబానీ కుటుంబం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.
2011 సంవత్సరంలో ఈ ఇంటిని పబ్లిక్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ ధీరూభాయ్ అంబానీ ఛాయాచిత్రాలు, ఆయన జ్ఞాపకాలు, అవార్డులు భద్రపరచబడ్డాయి. అమితాబ్ టియోటియా డిజైన్స్ సహాయంతో ఈ ఇంటిని పునరుద్ధరించారు. సౌర లైట్లు, టేకు కలప, పాత ఫర్నిచర్‌ను కూడా ఇందులో చూడవచ్చు.
మీరు కూడా ఈ చారిత్రాత్మక ఇంటిని చూడాలనుకుంటే మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అక్కడికి వెళ్ళవచ్చు. టికెట్ ధర కేవలం రూ. 2 మాత్రమే. ఇక్కడ మీరు అంబానీ కుటుంబం స్ఫూర్తిదాయకమైన కథను కూడా తెలుసుకోవచ్చు. వారి జీవితానికి సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.
యాంటిలియా ధర:
ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని విలువ దాదాపు రూ.15,000 కోట్లు. ఈ 27 అంతస్తుల భవనం 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా, సాంప్రదాయ AC లేకుండా ప్రత్యేకమైన కూలింగ్ సాంకేతికత వంటి సౌకర్యాలను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి