Yamaha e-bikes: యమహా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ బైక్స్.. సింగిల్ చార్జ్‌పై 120కిమీ.. సిటీ అవసరాలకు బెస్ట్ చాయిస్

|

May 20, 2023 | 6:30 AM

ఆటో రంగం అంతా ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్న నేపథ్యంలో యమహా కూడా రెండు కొత్త ఎలక్ట్రిక్  బైక్ లను లాంచ్ చేసింది. ముఖ్యంగా సిటీ అవసరాలకు, అర్బన్ ప్రజలను లక్ష్యంగా చేసుకొని వీటిని ఆవిష్కరించింది. యమహా బూస్టర్ ఈజీ, యమహా బూస్టర్ ఎస్ పెడెలెక్ పేర్లతో వీటిని పరిచయం చేసింది.

Yamaha e-bikes: యమహా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ బైక్స్.. సింగిల్ చార్జ్‌పై 120కిమీ.. సిటీ అవసరాలకు బెస్ట్ చాయిస్
Yamaha Booster Easy
Follow us on

యమహా కంపెనీ బైక్స్ అంటే అందరిలోనూ ఆసక్తి. ముఖ్యంగా యువతకు ఈ బ్రాండ్ అంటే అదొరకమైన క్రేజీనెస్ ఉంటుంది. అందుకే ఆ కంపెనీ నుంచి ఎటువంటి అప్ డేట్ వచ్చినా అమితాసక్తి కనబరుస్తారు. ఇటీవల ఆటో రంగం అంతా ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్న నేపథ్యంలో యమహా కూడా రెండు కొత్త ఎలక్ట్రిక్  బైక్ లను లాంచ్ చేసింది. ముఖ్యంగా సిటీ అవసరాలకు, అర్బన్ ప్రజలను లక్ష్యంగా చేసుకొని వీటిని ఆవిష్కరించింది. యమహా బూస్టర్ ఈజీ, యమహా బూస్టర్ ఎస్ పెడెలెక్ పేర్లతో వీటిని పరిచయం చేసింది. వీటిల్లో యమహా బూస్టర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ కాగా.. రెండోది యమహా బూస్టర్ ఎస్ పెడెలెక్ ఎలక్ట్రిక్ మోపెడ్. రెండు వాహనాలు యూరోప్ లో లాంచ్ అయ్యాయి. బూస్టర్ ఎస్ పెడెలెక్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది. అలాగే యమహా బూస్టర్ ఈజీ బైక్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివారలు ఇప్పుడు చూద్దాం..

ఆ మోడళ్లకు అప్ గ్రేడ్ వెర్షన్..

1980, 1990ల్లో యూరోప్ లో అందరి మన్ననలు పొందిన యమహా 50సీసీ ఎంకేబీ స్కూటర్లకు అప్ గ్రేడెడ్ వర్షెనే ఈ బూస్టర్ ఈజీ, బూస్టర్ ఎస్ పెడెలెక్ వాహనాలు. ఇది అల్యూమినియం యూ ఫ్రేమ్ ని కలిగి ఉంటుంది. వీటికి 20 అంగుళాల చక్రాలు, కేవలం యమహాలోనే లభ్యమయ్యే ఫోర్క్ కవర్లు ఉన్నాయి. టైర్ మందం నాలుగు అంగుళాలు ఉంటుంది. 180ఎంఎం డయామీటర్ డిస్క్ బ్రేకులు ఉంటాయి.

స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ రెండు బైక్ లలో ఆటోమేటెడ్ అసిస్టెన్స్ ఫంక్షన్ ఉంటుంది. ఇది కఠినమైన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అధిక శక్తిని అందిస్తాయి. బూస్టర్ ఈజీ ద్విచక్రవాహనం గరిష్టంగా గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. అలాగే బూస్టర్ ఎస్ పెడెలెక్ మోపెడ్ గంటకు 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లో వెళ్లగలుగుతుంది. రెండు వాహనాల్లోనూ గరిష్ట టార్క్ 75ఎన్ఎం ఉంటుంది. రెండు వాహనాలు సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇవి..

ఈ బైక్ లలో సూపర్ నోవా హెడ్ లైట్, కోసో ఎల్ఈడీ టైల్ లైట్ ఉంటాయి. బూస్టర్ ఎస్ పెడెలెక్ లో 2.8 అంగుళాల కలర్ డాట్ మ్యాట్రిక్స్ టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. బూస్టర్ ఈజీ వాహనంలో 1.7 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే వీటిని స్మార్ట్ ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..