Yamaha RX 100 launch 2023: కుర్రకారు మనసు దోచుకునేందుకు మరింత కొత్తగా మార్కెట్లోకి వస్తోంది యమహా ఆర్ఎక్స్ 100. ఈ బైక్ పాత రోజుల్లో తనదైన ముంద్ర వేసింది. ఈ బైక్ దాని గొప్ప పనితీరు. అదిరిపోయే పికప్‌ను చాలా ఇష్టపడేవారు. మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్ 100 బైక్ ఉత్పత్తిని 1996లో క్లోజ్ చేశారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఈ బైక్‌ను భారత మార్కెట్లోకి తిరిగి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి బైక్‌ను కంపెనీ తీసుకురాబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు తాజా నివేదికలో, ఈ బైక్ యొక్క పునరాగమనానికి సంబంధించి చాలా విషయాలు స్పష్టమయ్యాయి, దాని గురించి మేము మీకు చెప్పబోతున్నాము.
ఈ బైక్‌కి ఇప్పటికీ అభిమానులు భారతీయ మార్కెట్‌లో ఉన్నారని కంపెనీ విశ్వసిస్తోందని మీడియా నివేదికలలో పేర్కొంది. కంపెనీ దాని సక్సెసర్ మోడల్‌పై పని చేస్తోంది. అయితే ఇది ఎప్పుడు మార్కెట్లోకి రానుందన్న విషయం ఖచ్చితంగా చెప్పలేకపోయింది. లాంచ్ చేయడానికి సమయం పట్టవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే.. మీరు యమహా నుండి వచ్చిన RX 100 సక్సెసర్ మోడల్‌ను ఖచ్చితంగా త్వరలోనే చూడవచ్చు.
యమహా ఇండియా ఛైర్మన్ ఇషిన్ చిహానా ఆటోకార్ ప్రొఫెషనల్‌తో మాట్లాడుతూ.. “యమహా RX100 భారతదేశానికి చాలా ప్రత్యేకమైన మోడల్. దాని స్టైలింగ్, తక్కువ బరువు, పవర్, సౌండ్‌కు స్పెషల్ అని అన్నారు. అదే స్థాయిలో మరోసారి మార్కెట్లోకి తీసుకురావాలంటే మరికొంత సమయం పడుతుందని తెలిపారు. అయితే, రాబోయే రోజుల్లో కనీసం 200 cc ఉండాలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం