ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు.. అర్హతలు ఏంటంటే..

World’s most expensive credit card:మీరు ఎప్పుడైనా పరిమితి లేని క్రెడిట్ కార్డ్ గురించి విన్నారా? ఇది లిమిట్‌ లేకుండా లక్షలాది, కోట్ల విలువైన కొనుగోళ్లు చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. బిలియన్ల విలువైన అపరిమిత షాపింగ్‌ను అందించే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన క్రెడిట్ కార్డ్ ఇది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసా? దీని కోసం ఎంత ఖర్చవుతుందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు.. అర్హతలు ఏంటంటే..
high net worth credit card

Updated on: Dec 28, 2025 | 6:47 PM

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణం. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు. దీని పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్. సింపుల్‌గా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని కూడా పిలుస్తారు. దీనిని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్‌ జారీ చేస్తుంది. ఈ కార్డు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది (World’s most expensive credit card)మాత్రమే కాదు. ఎంతో ప్రత్యేకమైనది కూడా ఇది అందరికీ అందుబాటులో ఉండదు. సాధారణ కార్డుల మాదిరిగా దీనికి దరఖాస్తు చేయలేము.

నివేదికల ప్రకారం..అమెక్స్ బ్లాక్ కార్డ్ ఏ ఇతర బ్యాంకు లాగా ప్రామాణిక దరఖాస్తు ప్రక్రియ ద్వారా లభించదు. దీన్ని పొందడానికి మీకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రత్యేక ఆహ్వానం అవసరం. 1999 లో ప్రారంభించబడిన ఈ కార్డు 1980 ల నుండి వార్తల్లో ఉంది. కానీ దాని హోల్డర్లు చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉన్నట్టుగా సమాచారం. భారతదేశంలో అమెక్స్‌ బ్లాక్‌ కార్డ్‌ కలిగిన వారు కేవలం 200 మంది మాత్రమే ఉన్నరట. కాగా, ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించిందని సమాచారం.

అమెక్స్ బ్లాక్ కార్డుకు అర్హత సాధించాలంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్లాటినం కార్డుపై సంవత్సరానికి $350,000, $500,000 మధ్య ఖర్చు చేయాలి. అదనంగా బలమైన క్రెడిట్ స్కోరు చాలా అవసరం. మీ ఖర్చు విధానాల ఆధారంగా అమెక్స్ నెలవారీ పరిమితిని నిర్ణయిస్తుంది. ఇది కాలానుగుణంగా మారుతుంది. ప్రైవేట్ జెట్‌ల నుండి లగ్జరీ కార్లు, వజ్రాలు, నగలు, ఖరీదైన ఇళ్ల వరకు ప్రతిదీ కొనుగోలు చేయడానికి ప్రజలు ఈ కార్డును ఉపయోగించవచ్చు. దీన్నిబట్టి ఈ కార్డు కేవలం ధనవంతుల కోసమేనని స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..