Rupee All Time Low: ఆల్ టైం రికార్డ్ స్థాయికి కుప్పకూలిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..

Rupee Value: భారత రూపాయి విలువ కుప్పకూలుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పతనమవుతోంది. దీని వల్ల భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం జరగడంతో పాటు దేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. దీని వల్ల ప్రజలపై నేరుగా రూపాయి విలువ పతనం ప్రభావితం చూపనుంది.

Rupee All Time Low: ఆల్ టైం రికార్డ్ స్థాయికి కుప్పకూలిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..
Indian Rupee

Updated on: Dec 16, 2025 | 11:38 AM

దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితిని రూపాయి ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోతుంది. ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్థాయికి దిగజారుతూనే ఉంది. సోమవారం 90.78 వద్ద ముగిసిన రూపాయి.. మంగళవారం ఏకంగా 5 పైసలు క్షీణించిన రూపాయి.. 90.83కి చేరుకుని జీవినకాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ స్థాయికి మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్దిరోజులుగా బ్రేకుల్లేకుండా పడిపోతూనే వస్తున్న రూపాయి.. ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మరింతగా పతనమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలపై నేరుగా ప్రభావం పడనుంది.

ఏయే ధరలు పెరగనున్నాయంటే..?

మొబైల్, టీవీల తయారీకి ఉపయోగపడే చిప్స్, బోర్డుల వంటి వాటిని మనం విదేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. దీని వల్ల తయారీ కంపెనీలపై భారం పడనుంది. దీంతో టీవీలు, స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. జనవరి నుంచి టీవీల ధరల 3 నుంచి 4 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక మొబైల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముంది. దీంతో పాటు ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను కూడా టెలికాం కంపెనీలు పెంచనుండటంతో మొబైల్ నిర్వాహణ సామాన్యులకు మరింత భారం కానుంది. అటు సెప్టెంబర్‌లో 32 అంగుళాలకు మించిన టీవీలపై కేంద్రం జీఎస్టీ తగ్గించింది. గతంలో 28 శాతం ఉండగా.. ఇప్పుడు 18 శాతానికి తగ్గించడంతో వాటి ధరలు రూ.4,500 వరకు తగ్గాయి. ఇప్పుడు ఆ ధరలు కాస్త పెరగనున్నాయి. ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. వీటితో పాటు ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులైన ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రీజ్ వంటి ధరలు కూడా పెరిగే అవకాశముంది.

కారణాలు ఇవే..

రూపాయి విలువ కుప్పకూలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ టారిఫ్‌లు కారణం. దీని వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ముందుకు రావడం లేదు. విదేశీయులు ఇక్కడ ఉన్న పెట్టుబడులను విదేశాలకు తరలిస్తున్నారు. అలాగే మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి ఫండ్స్‌ను విత్ డ్రా చేసుకుంటున్నారు. అంతేకాకుండా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య డీల్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి. రూపాయి విలువ క్షీణించడానికి ఇవే కారణాలుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.