
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా తగ్గిపోతుంది. గత కొద్దిరోజులుగా మరింతగా క్షీణించిపోతుంది. దీని వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతోండగా.. మరికొన్నింటిపై కూడా ఇది ఎఫెక్ట్ చూపనుంది. రూపాయి విలువ తగ్గుదల భారత ఆర్ధిక వ్యవస్థతో పాటు చాలా వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకం విధించడంతో అప్పటి నుంచి రూపాయి విలువ తగ్గుతోంది. దీని వల్ల భారతదేశంలోని తమ పెట్టుబడులను విదేశీ పెట్టుబడుదారులు వేరే దేశాలకు తరలిస్తున్నారు. దీని వల్ల రూపాయి పతనమవ్వడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, దిగుమతి చేసుకునే వస్తువులు, కార్ల ధరలు పెరిగే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
సెల్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వస్తువులకు అవసరమైన కంప్రెసర్లు, కంట్రోలర్లు, చిప్‌లు ఎక్కువగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వీటి ధరలు కూడా పెరిగే ప్రమాదముంది. ఎయిర్ కండీషనరల్ ధరలు 7 శాతం వరకు పెరిగే అవకాశముండగా.. రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశముంది. ఇక స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.5 వేల వరకు పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇక రూపాయి పతనంతో ఆటోమొబైల్ రంగం తీవ్రంగా నష్టపోనుంది. దీని వల్ల ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా పెరగున్నాయి. మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. ఇక మెర్సిడెస్ కూడా కొత్త ఏడాది ప్రారంభంలో ధరలును పెంచనుంది.
రూపాయి పతనం వల్ల కొన్ని కంపెనీలకు నష్టం జరిగితే.. మరికొన్ని కంపెనీలు లాభపడనున్నాయి. నిట్వేర్, ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్‌వేర్‌లను ఎగుమతి చేసే కంపెనీలు గణనీయంగా లాభపడే అవకాశం ఉంది.