AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Investments: ఎస్‌ఐపీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. ఈ టిప్స్‌తో ఆపద వేళ ఆర్థిక భరోసా

ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు కూడా మారుతున్నాయి. గతంలో స్థిర ఆదాయ పథకాలైన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే క్రమేపి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ వంటి పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపతున్నారు. అయితే ఇలాంటి పథకాల వల్ల రాబడి బాగానే ఉన్నా అత్యవసర సమయాల్లో నగదు లిక్విడిటీ అనేది సమస్య మారుతుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐపీ పెట్టుబడిదారులు అత్యవసర నిధి ఎలా సమకూర్చుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

SIP Investments: ఎస్‌ఐపీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. ఈ టిప్స్‌తో ఆపద వేళ ఆర్థిక భరోసా
Sip Investment
Nikhil
|

Updated on: May 28, 2025 | 7:59 PM

Share

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌లో పెట్టుబడి పెడుతూనే అత్యవసర నిధిని పునర్నిర్మించడం అనేది దీర్ఘకాలిక ఆర్థిక భరోసాకు చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఊహించని ఖర్చుల వల్ల మీ పొదుపు ప్రయాణం ఆగకుండా ఉంటుందని చెబుతున్నారు. కొన్ని ఆలోచనాత్మక సర్దుబాట్లతో మీ పెట్టుబడి లక్ష్యాలను విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. నెలకు రూ. 80,000 సంపాదించే పెట్టుబడిదారుci నెలవారీ జీవన వ్యయాల కోసం రూ.60,000 కేటాయించి, రూ. 20,000 ఎస్‌ఐపీలో పెట్టుబడులకు వెళుతుంది. అయితే అనుకోని సందర్భంలో అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా రూ.60 వేల నుంచే పొదుపు చేయాలని కానీ ఎస్‌ఐపీ పెట్టుబడిని విచ్చిన్నం చేయకూడదని చెబుతున్నారు. అలాగే రోజువారీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐపీ పెట్టుబడిదారులు ఖర్చుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? చూద్దాం.

ఖర్చుల నివారణ

మీ నెలవారీ రూ.60,000 ఖర్చుల్లో మళ్లీ ఎంత పొదుపు చేస్తామో? అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భోజనం, వినోదం, ప్రీమియం సభ్యత్వాలు లేదా బ్రాండెడ్ కొనుగోళ్లకు నెలకు రూ.5,000 – రూ.10,000 వరకు ఖర్చు పెడతారని వీటి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సొమ్మును మీ అత్యవసర కార్పస్ వైపు పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. 

బోనస్‌లు

ఏదైనా వార్షిక బోనస్, బహుమతి డబ్బు, క్యాష్ బ్యాక్ లేదా సైడ్ గిగ్ల నుండి వచ్చే ఆదాయం నేరుగా అత్యవసర నిధిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి రాబడి అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి వాటిని జీవనశైలి మెరుగుదలలకు ఖర్చు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి

తాత్కాలిక ఎస్‌:పీ తగ్గింపు (హైబ్రిడ్ వ్యూహం)

ఖర్చులను తగ్గించడం కుదరని పక్షంలో మూడు నెలల పాటు ఎస్‌ఐపీల్లో విరాళాలలో తాత్కాలికంగా రూ. 5,000 తగ్గింపును పరిగణించండి. ఖర్చు పొదుపులో రూ. 10,000తో కలిపి, ఇది మీ అత్యవసర నిధికి నెలకు రూ. 15,000 కేటాయించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ నిధి ప్రాథమిక స్థాయికి (రూ. 30,000-రూ. 40,000) చేరుకున్న తర్వాత మీరు మీ పూర్తి ఎస్‌ఐపీ విరాళాలను తిరిగి ప్రారంభించవచ్చు. క్లిష్ట సమయాల్లో ఎస్‌ఐపీలను పాజ్ చేయడం వల్ల నష్టాలు తగ్గుతాయనే నమ్మకం ఒక “కల్పితకథ” అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..