Silver Prices: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.! వెండి ధరలు తగ్గుతాయ్.. ఇదిగో ప్రూఫ్..

దడ పుట్టిస్తోంది వెండి ధర. పసిడి కూడా బేజారైపోతోంది. ఆల్రెడీ కొన్నవాళ్లకు ఖుషీలు. కొనాలనుకునేవాళ్లకు మాత్రం ఫికర్లే. లక్షదాటి, 2 లక్షలు దాటి మరో పాతికవేలు దూసుకెళ్లి ర్యాపిడ్‌ మోడ్‌లో టాప్‌గేర్‌లో నడుస్తోంది వెండి బండి. కానీ, భవిష్యత్తు వెండి కొండ కింద పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Silver Prices: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.! వెండి ధరలు తగ్గుతాయ్.. ఇదిగో ప్రూఫ్..
Silver 5

Updated on: Dec 30, 2025 | 1:28 PM

పెరగడమే తప్ప తగ్గడం తెలియని బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. గోడకు కొట్టిన బంతిలా కాకున్నా, గణనీయంగానే ధరలు తగ్గుతున్నాయి. గోల్డ్‌, సిల్వర్‌ ధరలు తగ్గినా, ఇప్పటికీ ఈ రెండులోహాలు కొండెక్కి కూర్చున్నాయి. స్విచ్‌ ఎక్కడో పడితే, బల్బ్‌ ఇక్కడ వెలుగుతుంది. మన దగ్గర గోల్డ్‌, సిల్వర్‌ ధరలు పెరగాలంటే అంతర్జాతీయంగానే ఆ పరిణామాలు జరగాలి. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్లే పసిడి, వెండి తగ్గుతున్నాయి. ట్రేడింగ్‌ పరిణామాలతోనే గోల్డ్‌, సిల్వర్‌ ధరల్లో క్షీణత కనిపించింది. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో పాటు లాంగ్‌ పొజిషన్ల నుంచి వెనక్కి తగ్గడంతో ధరలు యూటర్న్‌ తీసుకున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయంగా 66 శాతం పెరిగింది బంగారం.

ఇదిలా ఉంటే.. ఏడాది క్రితం మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే… అది ఇప్పుడు 2 లక్షల 15 వేల రూపాయలు అయ్యేది. అంటే వంద శాతం పైగా పెరిగేది. మీకు లక్ష రూపాయల పైనే లాభం వచ్చేది. ఇది సిల్వర్ ధరలు గడిచిన ఏడాదిలో ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభం. అయితే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ వెండి ధరలు పెరిగిన ప్రతీసారి 40-90 శాతం పతనమయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఔన్స్ వెండి ధర 1980లో 50 డాలర్ల నుంచి 5 డాలర్లకు చేరింది. అలాగే 2011లో 48 డాలర్ల నుంచి 12 డాలర్లు.. 2020లో 30 డాలర్ల నుంచి 18 డాలర్లకు పడిపోయాయంటున్నారు. పారిశ్రామిక డిమాండ్, చైనా ఎగుమతి ఆంక్షలతో ధరలు పెరుగుతున్నా.. క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లను అలెర్ట్ చేస్తున్నారు. మరి మీరు కూడా వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. కాస్త ఆగండని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి