
మనకు ఎంతో ముఖ్యమైన మొబైల్ నెంబర్ గురించి చాలా మందికి తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు మేం మీకు చెప్పబోతున్నాం. మన దేశంలో, మొబైల్ నంబర్లకు సంబంధించిన నియమాలను TRAI (టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా), టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) రూపొందిస్తాయి. మొబైల్ సేవలు ప్రారంభించినప్పుడు, వినియోగదారులను సులభంగా గుర్తించడానికి, నెట్‌వర్క్ నిర్వహణలో ఏవైనా సమస్యలను ఉంటే పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు ఒకే పరిమాణంలో ఉండాలని నిర్ణయించారు. దీని కోసం, 10-అంకెల ఫార్మాట్‌ను తీసుకొచ్చారు.
అయితే ఈ నెంబర్ మొదటి అంకె ఎల్లప్పుడూ 9, 8, 7 లేదా 6 తో మొదలయ్యేట్టు ఏర్పాటు చేశారు. ఈ మొదటి అంకెలు ఆ నంబర్ మొబైల్ నెట్‌వర్క్‌ను చూసిస్తాయి. ఒకసారి మీరు 10 అంకెలను పరిశీలిస్తే, అవి దాదాపు 100 కోట్ల (1 బిలియన్) విభిన్న సంఖ్యల కలయికలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదీ కాకుండా నంబర్‌లో 12 లేదా 13 అంకెలు ఉంటే దాన్ని గుర్తించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.అందుకనే 10 అంకెలు అయితే గుర్తుంచుకోవడం సులభమని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా మన దేశంలో మొబైల్ నంబర్ ముందు +91 ఉంటుంది. ఇది మన దేశ కోడ్‌ను సూచిస్తుంది. ఒక వేళ మీరు ఎవరికైనా అంతర్జాతీయ కాల్ చేయాలనుకుంటే అప్పుడు మీరు మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ముందు +91ని యాడ్ చేసి కాల్ చేయాలి. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి డిజిటల్ గుర్తింపుగా మారిపోయింది. అది OTP అయినా, బ్యాంక్ లావాదేవీ నోటిఫికేషన్‌లు అయినా లేదా సోషల్ మీడియా ఖాతా ధృవీకరణ అయినా, ప్రతిదీ దానిపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.