Silver: ఒక్క రోజులో రూ. 20 వేలు అప్.. ఆ మర్నాడే రూ. 21 వేలు డౌన్.! వెండి కొండ అమాంతం కిందపడింది

ఎందుకో ఏమో వెండికొండ రివ్వున మెరిసిపోతుంది.అంతలోనే రేటు ఢమాల్‌ అవుతోంది.బంగారంతో పోటీ పడిన వెండికి ఎందుకని ఈ ఉత్తానపతనాలు. వినియోగపరంగా ఎంతో డిమాండ్‌ వున్నా సరే మార్కెట్‌లో సిల్వర్‌ రన్‌ డీలా పడిపోవడానికి కారణాలేంటి? చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Silver: ఒక్క రోజులో రూ. 20 వేలు అప్.. ఆ మర్నాడే రూ. 21 వేలు డౌన్.! వెండి కొండ అమాంతం కిందపడింది
Silver 3

Updated on: Dec 30, 2025 | 8:05 AM

బంగారంతో ధీటుగా  నిన్నామొన్నటి దాకా  వెండి ధరలకు రెక్కలొచ్చాయి.కానీ వెండి వెలుగుల దూకుడుకు కళ్లెం పడింది. పెరుగుట విరుగట కొరకే అన్నట్టు మళ్లీ భారీగా పడిపోయాయి. కేజీ వెండి రేటు ఒక్క రోజులోనే 21,500 రూపాయిలు తగ్గింది, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,33,120కి  చేరింది. అటు స్టాక్‌ మార్కెట్‌లో  కేజీ వెండి రెండున్నర లక్షల నుంచి 2లక్షల 39 వేలకు దిగొచ్చింది. అనూహ్యంగా 20వేల పెరిగిన  వెండి ధర..ఆవెంటనే ఒక్క రోజులే 21 వేలకు ఢమాలైంది. అలా పెరగడం ఇలా తగ్గడం ఏంటనేది  ఓ అయోమయంగా మారింది. ఐతే మార్కెట్‌లో మళ్లీ సిల్వర్‌ షైన్‌ కావడం ఖాయమంటున్నారు నిపుణులు. రేటు గట్టిగా వున్నప్పుడే ప్రాఫిట్‌గా మలచుకోవాలని ఇన్వెస్టర్లు విక్రయాల బాటపట్టారు. తత్‌ ఫలితం  ప్రాఫిట్‌ బుకింగ్స్‌.. విక్రయాల ఒత్తిళ్లు వెరసి  వెండి ధర డౌన్‌ఫాల్‌కు దారి తీసింది.

వెండి ధర ఉత్తానపతనాలపై  అంతర్జాతీయంగా జరిగిన  పరిణామాల  ప్రభావం పడింది.  చికాగో మర్చంట్‌ ఎక్స్‌ఛేంజ్‌  2026 మార్చి ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించిన మార్జిన్‌ను 20వేల డాలర్ల నుంచి 25వేల డాలర్లకు పెంచింది.ఈ టైమ్‌లో  రిస్క్‌ తీసుకోవడం రైట్‌ చాయిస్‌ కాదన్నఆలోచనతో  ఇన్వెస్టర్లు విక్రయాల బాటపట్టారు, దాంతో ఒక్కసారిగా  విక్రయాల ఒత్తిడి పెరగడంతో వెండి రేటు పడిపోయిందంటున్నారు  నిపుణులు. ఇక  ట్రంప్‌ రాయబారంతో  రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ విరమణ కాబోతుందనే చర్చ కూడా వెండి ధరల తగ్గుదలకు రీజన్‌ అనేది మరో వాదన. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, రాజకీయ  పరిణామాలు వెండి, బంగారం రేట్ల ప్రభావం చూపిస్తుంటాయి. ఇదంతా ఒకవైపు. ప్రస్తుతానికి  ధరలు పడిపోయినా  మార్కెట్‌లో  వెండి మళ్లీ పుంజుకోవడం  పక్కా అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వెండిపై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా లాభమే అనేది  ఇన్వెస్టర్ల నమ్మకం .మరోవైపు   ఇండస్ట్రియల్ రంగంలో వెండికి  ఎంతో  డిమాండ్‌ వుందిప్పుడు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, సోలార్‌ ప్యానెల్స్‌, సెమీ కండక్టర్లలో వెండి వినియోగం పెరుగుతోంది.  ఇప్పుడు ధర తగ్గినా మళ్లీ మార్కెట్‌ వెండి మెరుపులు..ధరల ధగధగలు పెరగడం పక్కా అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి