భారతదేశంలోని ప్రతి మధ్యతరగతి కుటుబానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా నెలవారీగా వచ్చే ఆదాయంలో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మళ్లీ నెల తిరిగి వచ్చే సరికి చేతిలో చిల్లిగవ్వలేకుండా ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంటాయి. ఇలాంటి ఖర్చుల విషయంలో మనీ9 సర్వే చేపట్టింది. ప్రతినెల జీతం వస్తున్నా..? ఆ జీతం డబ్బులు ఎక్కడికి పోతున్నాయన్నదే తలెత్తుతున్ ప్రశ్న. Money9 సర్వే ప్రకారం, భారతీయ కుటుంబాలు ఒక నెలలో సంపాదించే ఆదాయంలో దాదాపు 39 శాతం నెలవారీ వంటింటి సరుకులు, కారులో పెట్రోల్, డీజిల్‌కే పోతున్నట్లు వెల్లడైంది. భారతీయ కుటుంబాల నెలవారీ ఆదాయంలో 19 శాతం నెలకు రేషన్ కొనడానికి, 8 శాతం కారులోకి ఇంధనం కొనడానికి ఖర్చు చేస్తున్నారు. ఈ సమాచారం Money9 వ్యక్తిగత ఫైనాన్స్ సర్వే నుంచి వచ్చింది.
రేషన్, ఇంధనం కాకుండా జీతంలో 12 శాతం విద్యుత్, నీరు, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించడానికి ఖర్చు అవుతుంది. అంటే రేషన్, ఇంధనం, విద్యుత్, నీరు, ఇంటర్నెట్ బిల్లులు కలిపితే జీతంలో 39 శాతం ఖర్చవుతుంది. ఇది కాకుండా జీతంలో ఎక్కువ భాగాన్ని వినియోగించే అనేక ఇతర ఖర్చులు ఉన్నాయి.
భారతీయ కుటుంబాల జీతంలో 10 శాతం పిల్లల ఫీజులకే ఖర్చు అవుతుందని సర్వేలో తేలింది. ఇది కాకుండా, జీతంలో 8 శాతం బట్టలు కొనడానికి, దాదాపు అదే మొత్తాన్ని మందుల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. భారతీయ కుటుంబాలు తమ జీతంలో 4 శాతం రుణ చెల్లింపు కోసం, 2 శాతం క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కోసం ఖర్చు చేస్తున్నారు.
Money9 సర్వే కూడా భారతీయ కుటుంబాలు తమ నెలవారీ జీతంలో కొంత భాగాన్ని ఆదా చేస్తాయని చూపిస్తుంది. అన్ని ఖర్చులు పోనూ దాదాపు 18 శాతం జీతం మిగిలి ఉంటుంది. ఇది పొదుపు,పెట్టుబడి కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది.
అయితే ఈ మనీ9 సర్వే ఆగస్టు నుండి నవంబర్ వరకు దేశంలోని 20 రాష్ట్రాల్లోని 115 కంటే ఎక్కువ జిల్లాల్లో కొనసాగింది. ఈ సర్వే 10 విభిన్న భాషలలో జరిగింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 1140 గ్రామాలు, పట్టణ వార్డులు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి