భద్రత, ఫీచర్స్ మెరుగుపరచడానికి వాట్సప్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో అప్లికేషన్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్లలో మెసేజింగ్ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. పాత OS వెర్షన్‌లలో నడుస్తున్న కొన్ని Android, iOS, KaiOS ఉన్న ఫోన్లలో రేపటి నుంచి వాట్సప్ నిలిపివేయనుంది. వారు వాట్సప్ సేవలు పొందాలంటే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు అన్ని చాట్‌లను కొత్త ఫోన్ కొనడానికి ముందు బ్యాకప్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్ 4.0.4, పాత వెర్షన్‌లలో రన్ అయ్యే ఫోన్లో వాట్సప్ మెసేజింగ్ అప్లికేషన్‌కు పనిచేయదు. సామ్సంగ్ గెలాక్సీ SII, గెలాక్సీ S3 మిని, Optimus L5 Dual, Optimus L4 II Dual, Optimus F7, Optimus F5 ఫోన్లలో రేపటి నుంచి వాట్సప్ నిలిపివేయనున్నారు.
iOS
వాట్సప్ ని అప్‌డేట్ చేయడానికి iOS ముఖ్యం. iOS 10 కంటే పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో నడుస్తున్న ఏదైనా iPhone నవంబర్ 1 నుండి పని చేయదు. iPhone 6S, iPhone 6S Plus, Apple iPhone SE (1వ తరం) ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.
KaiOS
KaiOS 2.5.0, కొత్త వాటిపై నడుస్తున్న ఫోన్లలో మాత్రమే వాట్సప్ పని చేస్తుంది. జియోఫోన్, జియోఫోన్ 2 రెండింటిలో వాట్సప్ కొనసాగుతుంది.
Read Also.. Amazon Great Indian Festival: డిస్కౌంట్లో స్ట్మార్ట్ ఫోన్ కొనలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..