Whatsapp Cashback: వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్

Whatsapp Cashback: వాట్సాప్‌.. ఇది లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇందులోని మునిగి తేలుతుంటారు. చిన్న నుంచి పెద్దల..

Whatsapp Cashback: వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్

Updated on: Dec 04, 2021 | 2:56 PM

Whatsapp Cashback: వాట్సాప్‌.. ఇది లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇందులోని మునిగి తేలుతుంటారు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండాల్సిందే. ఇక యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ రోజరోజుకు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ తాజాగా వాట్సాప్‌లో పేమెంట్‌ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌ వాడేవారికి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. డబ్బులను బదిలీ చేస్తే క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. గత కొద్ది రోజుల క్రితమే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సేవలను ప్రారంభించింది. అయితే ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది వాట్సాప్.

నగదు బదిలీ చేసినప్పుడు 51 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం విశేషం. అయితే.. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది వాట్సాప్‌ సంస్థ. డబ్బులు పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫోన్ పే, గూగుల్ పే సైతం మొబైల్ పేమెంట్స్ ప్రారంభించిన సమయంలో క్యాష్ బ్యాక్ అందించాయి. దీంతో అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ సైతం ఆ వినియోగదారులను తన వైపు తిప్పుకునేందుకు అదే దారిలో వెళ్తోంది.

ఇవి కూడా చదవండి:

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!

Online Payments: ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేవారికి గూగుల్‌ కీలక ప్రకటన.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు..!