పెట్టుబడి పెట్టడంలో అయినా లేక రుణాలు తీసుకోవడంలో అయినా డైవర్సిఫికేషన్ చాలా అవసరం. ఒకే దానిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే మార్కెట్ ఒడిదొడుకులకు లోనైతే నష్టపోవాల్సి వస్తుంది. అదే విధంగా మీరు తీసుకునే రుణాల విషయంలో కూడా పర్సనల్, గోల్డ్, హోమ్ వంటి సురక్షిత, అసురక్షిత రుణాల సమ్మేళనం ఉండాలి. లేకపోతే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపి, అసలుకే మోసం వస్తుంది. అందుకే ఆర్థిక నిర్వహణల్లో డైవర్సీఫికేషన్ అనేది చాలా ప్రధానం. అయితే ఈ రోజు పెట్టుబడుల విషయంలో డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి? అలా డైవర్సిఫికేషన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అది మార్కెట్ అస్థిరత సమయంలో ఏ విధంగా ఇబ్బందులను తొలగిస్తుంది. లాభాలను ఎలా తెస్తుంది? ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఎందుకు ప్రాధాన్యం తెలుసుకుందాం..
నేటి డైనమిక్ ఫైనాన్షియల్ మార్కెట్లలో, బలమైన, విభిన్నమైన పెట్టుబడి విధానాన్ని కలిగి ఉండటం చాలా కీలకం. డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్‌లలో పెట్టుబడులను విస్తరించడమే. అంటే ఒకే చోట మొత్తం పెట్టుబడిని పెట్టకుండా.. విభిన్న మార్గాలలో దానిని విస్తరింపజేయడం అన్నమాట. ఇది రిస్క్ మేనేజ్‌మెంట్ కు బాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ మార్పులు, మార్కెట్ అనూహ్యత నేపథ్యంలో, పెట్టుబడిదారులు సంక్లిష్టతలను ఎందుర్కొంటారు. అలాంటి సమయంలోపెట్టుబడి దారులు తమ పోర్ట్‌ఫోలియోలను రక్షించుకోవడానికి ఈ మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ (బహుళ-ఆస్తి పెట్టుబడులు) బాగా ఉపకరిస్తాయి. ఒకే ఫండ్ లో ఇన్వెస్ట్ చేయకుండా.. విభిన్న ఫండ్స్ మీ డబ్బును డైవర్సిఫై చేయడం అన్నమాట. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..