Telugu News Business What is IRCTC autopay option? how it is useful for passengers?, check details in telugu
IRCTC Autopay: ఆటో పేతో ఆందోళనకు చెక్.. రైలు టికెట్ కన్ఫామ్ కాకపోతే వెంటనే రీఫండ్.. నో వెయింటింగ్ పీరియడ్..
ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ఈ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోపే ఆప్షన్ రైలు ప్రయాణికులకు ఒక వరమని చెప్పవచ్చు. ఐఆర్ సీటీసీ యాప్, వెబ్ సైట్ లో టిక్కెట్ బుక్కింగ్ కోసం ఆటోపే ఆప్షన్ ను ప్రవేశపెట్టారు.
రైలు ప్రయాణం అనేది మన దేశంలో సుఖమైన, సౌకర్యవంతమైన, చవకైన రవాణా మార్గం. చాలా మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి రైలునే ఉపయోగిస్తారు. అందువల్ల రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగానే ఉంటాయి. ప్రయాణానికి ఇబ్బంది లేకుండా టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. అవి కన్ఫామ్ అయితే ఇక ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేనట్టే. ఒకవేళ కాకపోతే వేరే రైలును ఎంపిక చేసుకోవచ్చు. అయితే ముందు రైలుకు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. కానీ టికెట్ కన్ఫామ్ కానప్పుడు ఆ డబ్బులు ఎలా తిరిగి వస్తాయనే ఆందోళన ఉంటుంది. ఆ సమస్య పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ఈ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోపే ఆప్షన్ రైలు ప్రయాణికులకు ఒక వరమని చెప్పవచ్చు. ఐఆర్ సీటీసీ యాప్, వెబ్ సైట్ లో టిక్కెట్ బుక్కింగ్ కోసం ఆటోపే ఆప్షన్ ను ప్రవేశపెట్టారు. ఇది ఇటీవల జరిగిన ముఖ్యమైన డెవలప్ మెంట్ గా చెప్పుకోవచ్చు. టిక్కెట్ బుక్కింగ్ లో దీని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటో పే ఆప్షన్ అంటే..
ఆటోపే ఆప్షన్ ను గేమ్ చేంజర్ గా భావించవచ్చు. టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఖాతా నుంచి చార్జీని తక్షణమే తగ్గించడానికి బదులు, నిర్ధిష్ట మొత్తాన్ని మాత్రమే బ్లాక్ చేస్తుంది. మీ టిక్కెట్ కన్ఫామ్ అయినప్పుడు బ్లాక్ చేసిన మొత్తం మీ ఖాతా నుంచి డెబిట్ (కట్ అవుతుంది) చేయబడుతుంది. టిక్కెట్ కన్ఫామ్ కాకపోతే బ్లాక్ చేసిన మొత్తం ఆటోమెటిక్ గా మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. తద్వారా మాన్యువల్ రీఫండ్ అభ్యర్థనల అవసరం ఉండదు.
ఆటోపే విధానం వల్ల రైలు ప్రయాణికులకు ఆర్థిక నష్టం ఉండదు. కన్ఫామ్ కాని టిక్కెట్ బుక్కింగ్ వల్ల డబ్బును పొగొట్టుకున్నామనే ఆందోళన చెందనక్కర్లేదు. బ్లాక్ చేసిన సొమ్ము టిక్కెట్ కన్పామ్ అయిన తర్వాత కట్ అవుతుంది. లేకపోతే ఖాతాలో జమ అవుతుంది.
ఈ విధానం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సమయం ఆదా అవుతుంది. టిక్కెట్లు కన్ఫామ్ కానప్పుడు మాన్యువల్ రీఫండ్ అప్లికేషన్ల అవసరం ఉండదు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది. బుక్కింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చార్జిని కట్ చేయడం కన్నా బ్లాక్ చేయడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో టిక్కెట్లు కన్ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఉపయోగించే విధానం..
ఐఆర్ సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లండి
మీకు కావాల్సిన రైలు, ప్రయాణ వివరాలను తెలుసుకోండి
పేమెంట్ గేట్ వేకి వెళ్లండి
మీ చెల్లింపు పద్ధతిగా ఆటో పే ఆప్షన్ ను ఎంచుకోండి
మీ బుకింగ్ వివరాలను మరోసారి చెక్ చేసుకుని, నిర్ధారణ చేయండి
ప్రయాణికులకు ఎంతో అనుకూలం..
చార్జీ చెల్లింపు దశలో ఆటో పే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. వినియోగదారులు ఈ అనుకూల ఫీచర్ ను ఉపయోగించుకోవడం సులభంగా ఉంటుంది.
తత్కాల్ టికెట్లు ప్రయాణానికి కొన్ని రోజుల ముందు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. తరచూ అధిక చార్జీలు ఉంటాయి. అయితే బెర్త్ కన్ఫామ్ అవుతుంది. ఆర్థిక ప్రమాదాన్ని తగ్గించే ఆటో పే ఆప్షన్ తో ప్రయాణికులు తత్కాల్ బుకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీనివల్ల కన్ఫామ్ టికెట్లను పొందవచ్చు.
ఆటో పే విధానం వల్ల ఐఆర్ సీటీసీ రిఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ పై పనిభారం తగ్గుతుంది. కన్ఫామ్ కాని టికెట్ల సొమ్ము (బ్లాక్ చేసిన చార్జీ) ఆటోమెటిక్ గా ప్రయాణికుడి ఖాతాలో జమ కావడం వల్ల ఐఆర్ సీటీసీ కస్లమర్ సర్వీస్, రీఫండ్ ప్రాసెసింగ్ విభాగాలకు ఒత్తిడి ఉండదు.
బుకింగ్ ప్రక్రియ సులభం కావడం, ఆర్థిక నష్టం లేకపోవడంతో ప్రయాణికులకు ఎంతో సానుకూలంగా ఉంటుంది.