దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే అవసరం. ఆధార్ కార్డు మనకు దేశ పౌరుడిగా గుర్తింపునిస్తుంది. పాన్ కార్డు మన ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఆర్థిక కార్యకలాపాలన్నీ చట్టానికి లోబడి జరిగేలా పర్యవేక్షిస్తుంది. కాబట్టి దేశంలోని ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అనేది ముఖ్యమైన పత్రం అని చెప్పవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులుంటే ఏమి జరుగుతుంది. అలా కలిగి ఉండడం చట్ట విరుద్దమా, వారికి ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుందో తెలుసుకుందాం.
పర్మినెంట్ అక్కౌంట్ నంబర్ (పీఏఎన్) కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఆ శాఖ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక్క పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉండడం చట్ట విరుద్ధం. వ్యక్తులు, వ్యాపారాలు, ఇతర సంస్థలకు పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దీనిలో ప్రత్యేకమైన పది అంకెలు ఉంటాయి. ఇది ఆ వ్యక్తికి ఆర్థిక లావాదేవీల కోసం అందించే గుర్తింపు పత్రం. బ్యాంక్ ఖాతాలను తెరవడానికి, రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలోనూ, వివిధ పెట్టుబడులు పెట్టడానికి పాన్ కార్డు చాలా అవసరం. సూటిగా చెప్పాలంటే మీరు చేసే ప్రతి ఆర్థిక కార్యకలాపాలనికి పాన్ కార్డు ఉండాల్సిందే.
పాన్ కార్డులో వ్యక్తి పేరు, అతడి ఫొటో, పుట్టిన తేదీ, పాన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అనేది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా కేటాయిస్తారు. ఆర్థిక లావాదేవీలకు రిఫరెన్స్ నంబర్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారందరికీ చాలా అవసరం. అలాగే రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు తప్పనిసరిగా అవసరమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..