Insurance Policy: పాలసీదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే డబ్బు ఎవరికి అందిస్తారు? చట్టం ఏం చెబుతోంది?

Insurance Policy: కొన్ని కంపెనీలు క్లెయిమ్‌ల త్వరిత పరిష్కారం కోసం నిబంధనలు సడలిస్తున్నాయి, ఉదాహరణకు LIC ఈ సందర్భాలలో కోర్టు నుండి ఆర్డర్ కోసం వేచి ఉండటానికి బదులుగా, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నుండి వచ్చిన మొత్తాన్ని ఎలా విభజించాలో వారసులు అంగీకరిస్తే..

Insurance Policy: పాలసీదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే డబ్బు ఎవరికి అందిస్తారు? చట్టం ఏం చెబుతోంది?

Updated on: Jun 21, 2025 | 6:59 PM

ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్పని పరిస్థితి. ఈరోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో రకాల ప్రమాదాల కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్‌ ఉండాలని సూచిస్తుంటారు నిపుణులు. కొన్నిసార్లు మనం ఎప్పుడూ ఊహించని పరిస్థితులు తలెత్తుతాయి. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద సంఘటనను తీసుకోండి. ఈ భయంకరమైన ప్రమాదం గురించి ఎవరికైనా కనీసం ఆలోచన ఉందా? ఇప్పుడు ఓ ప్రశ్న తలెత్తుతుంది. బీమా పాలసీలో పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బులు ఎవరికి అందుతాయి?

విమాన ప్రమాదం తర్వాత అనేక కేసులు తెరపైకి..

పీటీఐ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, పాలసీదారుడు, క్లెయిమ్ పొందిన నామినీ ఇద్దరూ ప్రమాదంలో మరణించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ నుండి లండన్ గేట్‌వేకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం మెడికల్‌ ఆస్పత్రి భవనంపై కూలిపోయి 241 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. అలాగే మరణించారు. భవనంలో ఉన్న 35 మంది వరకు మేడికోలు, సిబ్బంది మరణించారు.

ఇలాంటి పరిస్థితుల్లో దుఃఖాన్ని ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు తరువాత ఏమి జరుగుతుందో, బీమాలో వచ్చిన డబ్బును ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి వస్తుందో తెలుసుకుందాం.

బీమా పాలసీ జప్తు అవుతుందా?

ముందుగా బీమా మొత్తం ఎప్పుడూ జప్తు కాదని, , కానీ పాలసీదారుడి ఆస్తిలో భాగమవుతుంది. సాధారణంగా పిల్లలు, జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి వంటి చట్టపరమైన వారసులు దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత అనేక బీమా కంపెనీలు ఇలాంటి కేసులను ఎదుర్కొంటున్నాయి. LIC, Iffco Tokio, Tata AIG వంటి అనేక బీమా సంస్థలు పాలసీదారు, నామినీ ఇద్దరూ మరణించిన క్లెయిమ్‌లను అందుకున్నాయి.

ఇది కూడా చదవండి: No Petrol: జూలై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. కొత్త టెక్నాలజీ!

క్లెయిమ్ డబ్బు ఎవరికి లభిస్తుంది?

PTI నివేదిక ప్రకారం.. కొన్ని కంపెనీలు క్లెయిమ్‌ల త్వరిత పరిష్కారం కోసం నిబంధనలు సడలిస్తున్నాయి, ఉదాహరణకు LIC ఈ సందర్భాలలో కోర్టు నుండి ఆర్డర్ కోసం వేచి ఉండటానికి బదులుగా, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నుండి వచ్చిన మొత్తాన్ని ఎలా విభజించాలో వారసులు అంగీకరిస్తే, చట్టపరమైన వారసుల నుండి డిక్లరేషన్, నష్టపరిహార బాండ్లను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా బీమా కంపెనీలు పత్రాలను తనిఖీ చేసి, పాలసీదారుడు లేదా నామినీతో క్లెయిమ్ చేసే వ్యక్తి సంబంధాన్ని నిర్ధారించిన తర్వాత డబ్బును చెల్లిస్తాయి.

ఇది కూడా చదవండి: Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటంటే.. ఎక్కువ మంది చట్టపరమైన వారసులు ఉంటే ఈ పరిస్థితిలో కంపెనీ ఏం చేస్తుంది? హిందూ వారసత్వ చట్టంలో చట్టపరమైన వారసులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో కొడుకు-కుమార్తె, భార్య, తల్లి వంటి క్లాస్ వన్ చట్టపరమైన వారసులు ఉన్నారు. క్లాస్ వన్ చట్టపరమైన వారసులలో ఎవరూ లేకుంటే క్లాస్ 2 పరిగణిస్తారు. ఇందులో తండ్రి, సోదరుడు-సోదరి, మేనల్లుడు-మేనకోడలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!