మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా ఆర్థిక సాయం అందించి, వారి జీవితాలు ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నాయి. స్త్రీకి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. సమాజం బాగుపడుతుంది. దేశం కూడా అభ్యున్నతి సాధిస్తుంది. అందుకే మహిళల పేరుమీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది మహిళల ఆర్థిక వృద్ధిక సాయపడగలదని ఆ ప్రభుత్వం చెబుతోంది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తారు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే వారి జీవన పరిస్థితులు మెరుగు పడతాయని, వారికి కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. నిబంధనల మేరకు అర్హులైన మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి. మహిళలకు ఆర్థిక భరోసా, సామాజిక గౌరవం, ప్రోత్సాహం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 10 గ్యారంటీల్లో భాగంగా దీనిని కూడా ప్రకటించింది.
ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన పథకానికి ఎవరు అర్హులు. నిబంధనలు ఏమిటి తదితర వివరాలను చూస్తే… ఈ పథకం వివరాలను ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలందరికీ ఈ పథకం వర్తించదు. కొన్ని నిబంధనలను విధించింది. అలాగే దీనికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. సమీపంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. అక్కడ దరఖాస్తు తీసుకుని, అవసరమైన ప్రతాలన్నీ జత చేసి అధికారులకు ఇస్తే పని పూర్తయినట్టే. మీరు అన్ని విధాలా అర్హులైన సంబంధిత అధికారులు వెంటనే ఆమోదిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..