Anant Ambani: అంబానీల ఇంట్లో పెళ్లి వేడుక.. అక్కడే పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే..?

|

Jul 12, 2024 | 5:00 PM

దేశంలోని ప్రముఖులంతా అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు క్యూ కట్టారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడైన అనంత్ అంబానీకి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుక జామ్ నగర్‌లోని వంటారా ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకను అక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు. అందువల్ల అంబానీ ఫ్యామీలీకు సంబంధించిన జంతు సంరక్షణశాల వంటారా ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పెళ్లి వేడుకను అక్కడే నిర్వహిస్తున్నారని ప్రముఖులు పేర్కొంటున్నారు.

Anant Ambani: అంబానీల ఇంట్లో పెళ్లి వేడుక.. అక్కడే పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే..?
Ananth Ambani, Radika March
Follow us on

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఇంట శుక్రవారం పెళ్లి వేడుక జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశంలోని ప్రముఖులంతా అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు క్యూ కట్టారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడైన అనంత్ అంబానీకి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుక జామ్ నగర్‌లోని వంటారా ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకను అక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు. అందువల్ల అంబానీ ఫ్యామీలీకు సంబంధించిన జంతు సంరక్షణశాల వంటారా ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పెళ్లి వేడుకను అక్కడే నిర్వహిస్తున్నారని ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అనంత్ అంబానీ యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీలో చదివాడు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఎనర్జీ విభాగానికి ఎగ్జిక్యూటివ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 2022 నుండి బోర్డ్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్‌లో కూడా పనిచేస్తున్నాడు. అంబానీ వారసుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన ఇంధన, మెటీరియల్ వ్యాపారాల విస్తరణ, పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీలో దాని గ్లోబల్ కార్యకలాపాలను నడుపుతున్నారు. 2035 నాటికి నికర కార్బన్ జీరో కంపెనీగా మారేందుకు రిలయన్స్ ప్రయాణానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

అయితే జంతు సంక్షేమం పట్ల అనంత్‌కు ఉన్న మక్కువ కారణంగా రెస్క్యూ, హెల్త్‌కేర్, పునరావాసం, జంతువుల పరిరక్షణలో అనేక కార్యక్రమాల్లో ఆయన ప్రముఖంగా పాల్గొంటారు. జామ్‌నగర్‌లోని అంబానీల జంతు సంరక్షణ కేంద్రమైన వంటారాలో వేడుకలు నిర్వహించడంలో జంతు సంరక్షణపై ఉన్న అతనికి ఉన్న మక్కువను తెలుపుతుంది. వంటారా గ్రాండ్ ఓపెనింగ్ సమయంలో అనంత్ అంబానీ ప్రతి దేవతకి వాహనంగా జంతువు ఉందంటే సనాతన ధర్మంలో జంతువుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. వంటారా అనేది  ఫస్ట్ గ్రేడ్ సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం. ఇది రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన గ్రీన్ బెల్ట్‌లో 3,000 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 43 జాతుల్లో 2,000 కంటే ఎక్కువ జంతువులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..