
మీ ఆధార్ నెంబర్ మర్చిపోయారా..? లేక సమయానికి మీ జేబులో ఆధార్ కార్డు లేదా..? ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సింపుల్‌గా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవచ్చు.

మీ వద్ద ఉన్న ఉన్న స్మార్ట్ ఫోన్‌తో సులువుగా మీ ఆధార్ నెంబర్‌ను తెలుసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అనే ఆధార్ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.

మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలంటే ఇలా చేయండి.

ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Retrieve Lost or Forgotten EID/UID పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar No (UID) సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత పూర్తి పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఇవ్వాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. Login పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీకి మీ ఆధార్ నెంబర్ వస్తుంది.

ఎన్‌రోల్‌మెంట్ ఐడీ పొందడానికి కూడా ఇలాంటి పద్దతే అనుసరించాలి. అయితే Enrolment ID (EID) పైన క్లిక్ చేయాలి. ఇలా సులువుగా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలన్నా, ఇతర సేవలు పొందాలన్నా మీ ఆధార్ నెంబర్‌కు మీ మొబైల్ నెంబర్ తప్పకుండా అనుసంధానం చేసి ఉండాలి.