Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

|

Nov 23, 2021 | 12:50 PM

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్‌‌లను పెంచింది. పెరిగిన ఈ ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి.

Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?
Vodafone Idea
Follow us on

Vodafone Idea Tariff Hike: వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్‌‌లను పెంచింది. పెరిగిన ఈ ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. ప్లాన్‌లు దాదాపుగా ఎయిర్‌టెల్ మాదిరిగానే ఉన్నాయి. అంతకుముందు సోమవారం, ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాకిస్తూ ప్రీపెయిడ్ టారిఫ్‌‌లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అదే బాటలో వొడాఫోన్ ఐడియా కూడా వెళ్తుండడంతో ఇక నుంచి వినియోగదారులపై మరింత భారం పడనుంది.

వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరల ప్రకారం, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అతి చౌకైన ప్లాన్ ప్రస్తుతం రూ. 99గా మారనుంది. ఇంతకుముందు ఈ ప్లాన్ రూ.76కి అందుబాటులో ఉండేది. ఈ ప్లాన్‌లో రూ. 99 టాక్ టైమ్, 200MB డేటా, సెకనుకు ఒక పైసా వాయిస్ టారిఫ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

ఇది కాకుండా రూ.149 ప్లాన్ ఇప్పుడు రూ.179కి రానుంది. ఇందులో, అపరిమిత కాలింగ్, 300 SMSలు, 2GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు.

కంపెనీ రూ.219 ప్లాన్ ఇప్పుడు రూ.269కి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1GB డేటా అందివ్వనున్న ఈ ప్లాన్ కూడా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం రూ. 299కి రానుంది. దీని వాలిడిటీ 28 రోజులే. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది.

అలాగే రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.359కి అందుబాటులో ఉంటుంది. దీని కింద, అపరిమిత కాలింగ్ ప్రయోజనం, రోజుకు 100 SMSలతోపాటు రోజుకు 2GB డేటా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

ఇక రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ.479కి పెంచారు. దీని వాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.539కి అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 56 రోజులు కాగా, ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనంతోపాటు రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటా అందుబాటులో ఉంటుంది.

Also Read: All Electric Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా? ఎంత స్పీడ్‌తో ప్రయాణించిందో తెలిస్తే షాకే..!

LIC Policy: ఎల్‌ఐసీలో అద్భుమైన పాలసీ.. ఒకేసారి డబ్బు డిపాజిట్‌ చేయండి.. ప్రతినెల రూ.20వేల పెన్షన్‌ పొందండి..!