Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా (Vi) యూజర్లకు అదిరిపోయే‌ ఆఫర్.. ఈ రీఛార్జ్‌లు చేసుకుంటే రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌

|

Mar 29, 2021 | 12:15 PM

Vodafone Idea: భారత్‌లోని టెలికాం సంస్థల్లో ఒకటైన వోడాఫోన్‌ ఐడియా (Vi) తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే డబుల్‌ డేటా, వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ నైట్‌...

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా (Vi) యూజర్లకు అదిరిపోయే‌ ఆఫర్.. ఈ రీఛార్జ్‌లు చేసుకుంటే రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌
Vodafone Idea
Follow us on

Vodafone Idea: భారత్‌లోని టెలికాం సంస్థల్లో ఒకటైన వోడాఫోన్‌ ఐడియా (Vi) తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే డబుల్‌ డేటా, వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ నైట్‌ అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వోడాఫోన్‌ ఐడియా తాజాగా రూ.199 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేసినట్లయితే క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. అయితే అందించే క్యాష్‌బ్యాక్‌ మొత్తం పరిమితి ప్యాక్‌ ధరతో మారుతూ ఉంటుంది. రూ.400 కంటే తక్కువ గల ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌లు కేవలం రూ.20 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుండగా, రూ.400 నుంచి రూ.2,595 మధ్య గల రీఛార్జ్‌ల మీద రూ.60 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ అయిన రూ.199, రూ.405 మధ్య గల రీఛార్జ్‌ కాంబో ప్లాన్‌ (రూ.199,రూ.219, రూ.249, రూ.299, రూ.301, రూ.398, రూ.401, రూ.405)లతో రీఛార్జ్‌ చేస్తే వారికి 20 రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అలాగే రూ.499,రూ.555, రూ.558, రూ.595, రూ.601 రీఛార్జ్‌ చేసుకునే వారికి రూ.40 క్యాష్‌బ్యా్‌క్‌ అందించనున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. ఇంతకంటే ఎక్కువ రీఛార్జ్‌లపై రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

అయితే 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌తో చేసుకునే రీఛార్జ్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రీఛార్జ్‌లను చేసుకుంటే క్యాష్‌బ్యాక్‌ ఏప్రిల్‌ 10వ తేదీ లోపు జమ అవుతాయని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్‌ కూపన్లు క్రెడిట్‌ అయిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు ఉంటుందని తెలిపింది. అలాగే రూ.40, రూ.60 కూపన్లు 60 నుంచి రూ.90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

ఇవీ చదవండి:  LIC Housing Finance: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌… ఆరు నెలల ఈఎంఐ (EMI)లు మాఫీ.. ఎలాగంటే..!

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు.. మార్చి 31లోగా చేసేయండి..లేకుంటే భారీగా పెనాల్టీ.!

SMS: ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఎంఎస్ (SMS)‌లపై కొత్త నిబంధనలు.. రూల్స్‌ పాటించకపోతే నిలిపివేత.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్‌