VivoY72 5G: భారత్‌లో కొత్తగా విడుదలైన వివో వై72 జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు..!

Vivo Y72 5G: మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. ఇక తాజాగా వివో వై 72 (VivoY72 5G) స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లో విడుదలైన..

VivoY72 5G: భారత్‌లో కొత్తగా విడుదలైన వివో వై72 జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు..!
Vivoy72 5g

Edited By:

Updated on: Jul 15, 2021 | 7:15 PM

Vivo Y72 5G: మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. ఇక తాజాగా వివో వై 72 (VivoY72 5G) స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లో విడుదలైన ఈ మొబైల్‌.. తర్వాత వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అల్ట్రా గేమ్ మోడ్, ఈస్పోర్ట్స్ మోడ్‌ను కూడా ఇందులో అందించారు.

వివో వీ72 5జీ ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,990గా నిర్ణయించారు. ప్రిజం మ్యాజిక్, స్లేట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటాక్లిక్, బజాజ్ ఈఎంఐ స్టోర్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

డిస్కౌంట్‌ ఆఫర్లలో..

కాగా, ఈ మొబైల్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకుల క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,500 తగ్గింపును అందించనున్నారు. అలాగే మొదటి ఆరు నెలలు కేవలం రూ.999కే స్క్రీన్ రిప్లేస్‌మెంట్, రూ.10 వేల విలువైన జియో లాభాలు అందించనున్నారు. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వివో వై72 5జీ స్పెసిఫికేషన్లు:

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్ టచ్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్‌ అవుతుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

Oppo Reno 6 5G: ఒప్పో రెనో సిరీస్‌లో రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!

POCO F3 GT: పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌.. ముందే లీకైన స్పెసిఫికేషన్స్ వివరాలు.. విడుదల ఎప్పుడంటే

Follow Us