Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే సర్వీసులు.. టైమింగ్స్ వచ్చేశాయి..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో రానుంది. విశాఖపట్నం-బెంగళూరు మార్గంలో దీనిని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోెంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. టైమింగ్స్, స్టాపుల వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించాక స్టార్ట్ కానుంది.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే సర్వీసులు.. టైమింగ్స్ వచ్చేశాయి..
Vande Bharat Sleeper

Updated on: Aug 04, 2026 | 8:20 PM

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలో ఈ ఏడాది జనవరిలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా-గువహతి మధ్య పట్టాలెక్కింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ట్రైన్ ప్రారంభించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అందుకు మార్గం సుగమమైంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ రైలు టైమింగ్స్‌తో పాటు ఏయే స్టేషన్లలో ఆగుతుందనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ట్రైన్ టైమింగ్స్, రూట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టైమింగ్స్ ఇవే..

విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలుపై మరో అప్డేట్ వచ్చింది. ఈ రైలు టైమింగ్స్, స్టాపుల వివరాలు బయటకొచ్చాయి. వారంలో ఆరు రోజుల పాటు ఈ ట్రైన్ సర్వీసులు అందించనుంది. సోమవారం తప్ప మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో రాత్రి 8.15 గంటలకు ఈ రైలు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయల్దేరి విశాఖపట్నానికి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలులో 14 గంటల్లోనే విశాఖ-బెంగళూరు మధ్య ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న రైళ్లల్లో ప్రయాణించాలంటే 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్‌లో 14 గంటల్లోనే ఇరు నగరాల మధ్య ప్రయాణించవచ్చు. ఈ రైలు దువ్వాడ, కృష్ణాకెనాల్, నంద్యాల, ధర్మవరం మీదుగా వెళుతుంది.

త్వరలోనే ప్రారంభం

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలుపై రైల్వే అధికారులు స్పందించారు. ఈ మార్గంలో స్లీపర్ రైలు ప్రవేశపెట్టడంపై అంతర్గత ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే త్వరలోనే ఈ రైలుకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం రావాల్సి ఉంది. రైల్వే బోర్డు ఆమోదించాక ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విమానం తరహాలో లగ్జరీగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ కోచ్‌లు లేవు. దీంతో కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు గంటల కొద్ది కూర్చోని వెళ్లాలంటే అసౌకర్యానికి గురవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us