ఓర్నీ.. వాలెంటేన్స్‌ డే రోజున కండోమ్‌ల అమ్మకాలు రికార్డు బ్రేక్.. ఆ తర్వాత ప్లేస్‌లో..

వాలెంటైన్స్ వీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ జోరందుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదిక ప్రకారం, పూలు, చాక్లెట్లతో పాటు కండోమ్‌లకు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 14న నిమిషానికి 1,042 ఆర్డర్లు నమోదయ్యాయి. హార్ట్ షేప్ చాక్లెట్లు, గులాబీలు, సాఫ్ట్ టాయ్స్‌కు భారీ ఆదరణ లభించింది.

ఓర్నీ.. వాలెంటేన్స్‌ డే రోజున కండోమ్‌ల అమ్మకాలు రికార్డు బ్రేక్.. ఆ తర్వాత ప్లేస్‌లో..
Valentine's Week Shopping

Updated on: Feb 17, 2026 | 8:14 PM

వాలెంటైన్స్ వీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ జోరందుకుంది. ఈ స్పెషల్‌ డే నాడు పూలు, చాక్లెట్లు మాత్రమే కాకుండా కండోమ్‌లకు భారీ డిమాండ్ కనిపించింది. ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ Swiggy, Instamart విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ సారి వాలెంటైన్స్ వారంలో షాపింగ్ గణనీయంగా పెరిగింది. పూలు, చాక్లెట్లతో పాటు కండోమ్‌లు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు కండోమ్ ఆర్డర్లు రికార్డు స్థాయికి చేరాయి. 2025తో పోలిస్తే ఈ సంవత్సరం మరింత ఎక్కువ ఆర్డర్లు నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే మొత్తం గిఫ్ట్ ఆర్డర్లలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఒక్కరోజే నిమిషానికి 1,042 ఆర్డర్లు నమోదవడం విశేషం. హార్ట్‌ షేప్‌ చాక్లెట్లకు భారీ ఆదరణ లభించింది. వాటి కోసం సెర్చ్‌లు 500 శాతం పెరగడం గమనార్హం. సిల్క్, డార్క్, నట్టి, ఫ్రూటీ వేరియంట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ఖరీదైన గిఫ్ట్ ఆర్డర్లూ ప్రత్యేకంగా నిలిచాయి. కోల్‌కతాలో ఒక వినియోగదారు రూ.25,000కు పైగా విలువైన ప్రీమియం చాక్లెట్లు, గిఫ్ట్ ప్యాక్‌లు ఆర్డర్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీల్లో కూడా భారీ కార్ట్‌లు కనిపించాయి. గులాబీలకు డిమాండ్ గత వారంతో పోలిస్తే 10 రెట్లు పెరిగింది. టెడ్డీ డే సందర్భంగా సాఫ్ట్ టాయ్ ఆర్డర్లు 568 శాతం పెరిగాయి. అదనంగా బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై కూడా వినియోగదారులు భారీగా ఖర్చు చేయడం విశేషం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us