
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా దీని ద్వారా ఏ వస్తువైనా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, క్యాష్ బాక్ ఆఫర్లు లాంటివి చాలా ఉంటాయి. కానీ చిన్న చిన్న పొరపాట్లు వల్ల క్రెడిట్ కార్డులు వాడేవారు ఆర్ధిక ఇబ్బందుల్లో పడతారు. అందులో ఒకటి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేయడం. దీని వల్ల ఛార్జీలు ఎక్కువగా పడతాయి.
చాలామంది ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బులు విత్ డ్రా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పెద్ద నష్టమే జరుగుతుంది. డిజిటల్ విధానంలో విత్ డ్రా చేయడం లేదా షాపింగ్ కోసం ఖర్చు పెడితే 45 రోజుల వరకు సమయం ఉంటుంది. 45 రోజులు ఎలాంటి వడ్డీ పడదు. 45 రోజుల తర్వాత బిల్లు చెల్లించకపోతే వడ్డీ, ఆలస్య ఫీజులు వసూలు చేస్తారు. కానీ ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తే ఆ రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు. దీనికి 45 రోజుల గడువు వర్తించదు. అలాగే క్వాష్ అడ్వాన్స్ ఫీజు పేరుతో ప్రత్యకంగా వసూలు చేస్తారు. దీంతో క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా విత్ డ్రా చేయకపోవడమే మంచిది.
ఇక ఒక క్రెడిట్ కార్డు బిల్లు లేదా లోన్ చెల్లించేందుకు మరో క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా మంచికాదు. దీని వల్ల తాత్కాలికంగా ఊరట కలిగినా.. అధిక వడ్డీ వల్ల అప్పుల్లోకి వెళతారు. వడ్డీపై వడ్డీ పెరిగిపోయి ఆర్దిక నియంత్రణ తప్పుతుంది. దీంతో ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోతారు. ఒక కొంతమంది ఆవేశంలో ఆన్ లైన్ ఆపఱ్లు చూసి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత ఎందుకు కొన్నామా అని బాధపడుతుంటారు. ఇలాంటి తప్పులు చేయకండి. ఇక కొంతమంది ప్లాన్ లేకుండా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. చివరికి బిల్లు చెల్లించలేక అవస్థలు పడుతుంటారు. వచ్చే నెలలో బిల్లు ఎలా కట్టాలనేది ముందే ప్లాన్ చేసుకుని అప్పుడు ఖర్చు చేయండి. ఇలాంటి టిప్స్ పాటించకడం వల్ల మీరు సమర్థవంతంగా క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా..