38 ఏళ్ల ఓ అంబులెన్స్ డ్రైవర్..అతని సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడైన గౌతమ్ అదానీ సామ్రాజ్యం.. ఆ రిపోర్ట్ దెబ్బకు కుప్పకూలిపోతోంది. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో అదానీ మాత్రమే కాదు..ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది. అయితే అదానీ వర్సెస్ హిండెన్‌బర్గ్.. ఇప్పుడు ఇది పాత కథ. ఇప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థను మరో సారి కుదిపేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో బిజినెస్ దిగ్గజంను ఢీ కొట్టేందుకు.. కాదు కాదు పడగొట్టేందుకు పెద్ద వ్యాహంతో వస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పుడు అదానీ కాదు మరొకరికి టార్గెట్ చేశాడు. ఈ సారి మరొకరిని అప్పులపాలు చేసేందుకు లింక్స్ బయట పెడుతున్నట్లుగా సమాచారం.
అదానీ గ్రూప్‌పై రిపోర్ట్స్ తర్వాత కొత్త నివేదికను బయటపెట్టేందుకు రెడీ సిద్ధమవుతోంది హిండెన్‌బర్గ్ టీమ్. షార్ట్ సెల్లింగ్ సంస్థ త్వరలో మరొక నివేదికతో రాబోతోందని, దానిలో పెద్ద సీక్రెట్ బయట పెట్టనున్నట్లుగా సమాచారం. హిండెన్‌బర్గ్ జనవరి 24న అదానీ గ్రూప్‌పై ఒక రిపోర్టును విడుదల చేసింది. దీంతో ఇండియన్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ రిపోర్టులో అనేక ఆరోపణలు చేసింది హిండెన్‌బర్గ్.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్టు తర్వాత గౌతమ్ అదానీ సంపద 150 బిలియన్ డాలర్ల నుంచి 53 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మూడో స్థానం నుంచి 35వ స్థానానికి చేరుకున్నాడు అదానీ. అదే సమయంలో గౌతమ్ అదానీ గ్రూప్ 120 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
New report soon—another big one.
— Hindenburg Research (@HindenburgRes) March 22, 2023
ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఎవరిది..? ఎక్కడుంటుంది..? దీని వెనుక ఎవరున్నారు..? ఇప్పుడు ఇవేంటో తెలుసుకుందాం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక అమెరికాలో షార్ట్ సెల్లింగ్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ..ఆయా కంపెనీలపై రీసెర్చ్ చేస్తుంది. నాథన్ అండర్సన్ 2017లో ఈ సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హిండెన్‌బర్గ్.
నాథన్ ఆండర్సన్ కనెక్టికట్ విశ్వ విద్యాలయం నుండి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో చదివాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ లో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేశాడు. తిరిగి అమెరికా వచ్చి ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సంస్థలో పని చేశాడు. హారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటినం పార్ట్‌నర్స్ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశాడు. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో జరుగుతున్న మోసాలను బయట పెట్టాడు నాథన్ అండర్సన్.
అయితే ఇప్పడు గౌతమ్ అదానీ సంస్థపై రిపోర్టు చేసిన హిండెన్‌బర్గ్ ఇప్పుడు మరో పెద్ద రిపోర్టుతో వస్తున్నట్లుగా ప్రకటించుకుంది. హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది. ఇందులో కమ్మింగ్ సూన్ అని కంప్యూటర్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. కంపెనీని ట్వీట్ చేసిన తర్వాత మాత్రమే చాలా మంది దాని గురించి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇదంతా మన భారత వ్యాపార దిగ్గజాల గురించి కాదు అమెరికన్ బ్యాంకుల గురించి అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ఇది మరే ఇతర భారతీయ కంపెనీకి సంబంధించినది కాదని ఒక ట్విట్టర్ యూజర్ చెప్పడం విశేషం. ఓ చైనీస్ రిటైల్ కంపెనీపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వస్తోందని అంచనా వేస్తున్నారు నెటిజన్లు.
హిండెన్‌బర్గ్ అనేక కంపెనీలపై నివేదికలను సిద్ధం చేసింది. అదానీ గ్రూప్ మాత్రమే కాదు, అనేక అమెరికన్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తయారు చేసింది. కంపెనీ సెప్టెంబర్ 2020లో ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీదారు అయిన నికోలా కార్ప్‌పై రిపోర్టును సిద్ధం చేసింది. ఆ తర్వాత కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం