UPI Payments: యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు.. జస్ట్ మీ ఫోన్ ట్యాప్ చేస్తే చాలు.. ఇండియాలో వచ్చేసిందోచ్చ్..

యూపీఐ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ట్యాప్ అండ్ పే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా దీనిని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రారంభించారు. అలాగే మై యూపీఐ అనే ఫీచర్‌ను కూడా విడుదల చేశారు.

UPI Payments: యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు.. జస్ట్ మీ ఫోన్ ట్యాప్ చేస్తే చాలు.. ఇండియాలో వచ్చేసిందోచ్చ్..
Upi Payments

Updated on: Sep 11, 2026 | 11:05 AM

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేదా..? ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయలేకపోతున్నారా..? అయితే ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ తాజాగా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇంటర్నెట్, యూపీఐ యాప్ లేకపోయినా మీ ఫోన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు పీఓఎస్ మెషిన్ల ద్వారా ఒక ట్యాప్‌తో యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. మీ ఫోన్‌ను జస్ట్ పీఓఎస్ మెషిన్ల వద్ద ట్యాప్ చేయడం ద్వారా క్షణాల్లోనే పేమెంట్ చేయవచ్చు. అయితే ఫోన్‌లో స్క్రీన్ లాక్ అన్‌లాక్ చేసి ఉండాలి.

యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్స్ ఎలా చేయాలి..?

ఈ విధానంలో చెల్లింపులు చేయాలంటే మీ ఫోన్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) సదుపాయం ఉండాలి. మీ ఫోన్‌లో ఆ ఫీచర్‌ను ఆన్ చేయాలి. అలాగే పీఓఎస్ మెషిన్‌కు కూడా ఎన్‌ఎఫ్‌సీ సామర్థ్యం ఉండాలి. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్ లాక్ అన్ లాక్ చేయాలి. అనంతరం పీఓఎస్ మెషీన్‌పై మీ ఫోన్‌ను ట్యాప్ చేయాలి. దీని ద్వారా పీఓఎస్ మెషిన్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మీ పేమెంట్ పూర్తవుతుంది. దీని ద్వారా ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా, క్యూఆర్ కోడ్ స్కానర్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐకి అనుసంధానించబడ్డ రూపే క్రెడిట్ కార్డు, ఇతర ఖాతాలకు ఇది మద్దతు ఇస్తుంది. ట్యాప్ అండ్ పే విధానం ద్వారా యూపీఐ చెల్లింపు మరింత వేగవంతంగా చేయవచ్చు. దీని వల్ల దుకాణాల్లో యూపీఐ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా మారుతాయి. మొబైల్ డేటా, సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఇది సహాయపడుతుంది.

యూపీఐ పిన్ కూడా అవసరం లేదు..

ఈ విధానంలో పేమెంట్స్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక ట్యాప్ చేస్తే సరిపోతుంది. పిన్ ఎంటర్ చేయకుండా రూ.5 వేల వరకు చెల్లించవచ్చు. అంతకంటే ఎక్కువ పేమెంట్ చేయాలంటే పీఓఎస్ టెర్నినల్‌లో పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మై యూపీఐ అనే ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ది చేసింది. FiMI స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా నిర్మించారు. వివిధ బ్యాంకులు, UPI యాప్‌లలో వినియోగదారుడి UPI లావాదేవీలు, ఆటోపే సమాచారాన్ని ఒకే చోటికి తీసుకురావడానికి దీనిని రూపొందించారు. ఇందులో సేఫ్టీ స్విచ్ అనే ఫీచర్ ఉంది. తమ అకౌంట్ హ్యాక్ అయిందనే అనుమానం వస్తే యూపీఐ డెబిట్ లావాదేవీలను తిరస్కరించమని వినియోగదారులు రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఇక యూపీఐ నంబర్ డీలింక్ ఆప్షన్ ద్వారా తమ మొబైల్ నంబర్ ద్వారా యూపీఐ చెల్లింపులను స్వీకరించడాన్ని నిలిపివేయచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us