AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: సరిహద్దులు చెరిపేస్తూ యూపీఐ సేవలు.. ఇకపై డాలర్స్‌లోనూ..

ఇదిలా ఉంటే ప్రస్తుతం మనం యూపీఐ పేమెంట్‌ విధానంలో కేవలం రూపాయిల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నాం. కేవలం భారతదేశానికి మాత్రమే ఈ సేవలు పరిమితమయ్యాయి. అయితే రానున్న రోజుల్లో యూపీఐ ద్వారా డాలర్ల రూపంలోనూ చెల్లింపులు చేసేలా మార్పులు తీసుకురాబోతున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు యూపీఐతో ఒప్పందం ఉన్న దేశాల్లో యూజర్లకు డబ్బులు పంపించుకోవచ్చు...

UPI Payments: సరిహద్దులు చెరిపేస్తూ యూపీఐ సేవలు.. ఇకపై డాలర్స్‌లోనూ..
UPI Payments
Narender Vaitla
|

Updated on: Dec 12, 2023 | 3:00 PM

Share

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) భారత్‌లో ఎలాంటి సంచలనాలకు తెర తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో పేమెంట్స్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. మారుమూల గ్రామాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టీ కొట్టు నుంచి బడా బడా హోటల్స్‌ వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మనం యూపీఐ పేమెంట్‌ విధానంలో కేవలం రూపాయిల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నాం. కేవలం భారతదేశానికి మాత్రమే ఈ సేవలు పరిమితమయ్యాయి. అయితే రానున్న రోజుల్లో యూపీఐ ద్వారా డాలర్ల రూపంలోనూ చెల్లింపులు చేసేలా మార్పులు తీసుకురాబోతున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు యూపీఐతో ఒప్పందం ఉన్న దేశాల్లో యూజర్లకు డబ్బులు పంపించుకోవచ్చు. కేవలం డాలర్‌ మాత్రమే కాకుండా ఆయా దేశాలకు చెందిన కరెన్సీలో లావాదేవీలు చేసుకోవచ్చు.

యూపీఐ నుంచి వస్తున్న ఈ కొత్త సేవల ద్వారా ఇకపై దేశాల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోనున్నాయి. ఎలాంటి అవంతరాలు లేని లావాదేవీలకు వేదికగా మారనుందిన ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ల రూపంలో లావాదేవీలు చేసుకోవడానికి వీలుగా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కలిసి స్విఫ్ట్‌తో చర్చలు జరుపుతున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ.. సొసైటీ ఫర్‌ వరల్డ్ వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌ (స్విఫ్ట్‌) దేశాల మధ్య లావాదేవీలకు థర్డ్‌ పార్టీగా పనిచేస్తుంది. యూపీఐని స్విఫ్ట్‌తో అనుసంధానిస్తే.. దేశాల మధ్య లావాదేవీలు సులభంగా పూర్తవుతాయి.

ఇదిలా ఉంటే దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో.. ఆర్బీఐ యూపీఐ చెల్లింపుల స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల పరిమితి రూ. 1 లక్షగా ఉండగా, ఇప్పుడు దీనిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూపీఐ ద్వారా ఒకేసారి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే ఆటో డెబిట్‌ పరిమితిని కూడా ఒక్కో లావాదేవీకి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి