రైతుల అత్యాధునిక పంట సాగు విధానానికి ప్రోత్సాహం.. ఇవాళ సీఎన్‌జీ ట్రాక్టర్లను అవిష్కరించనున్న కేంద్ర మంత్రులు

|

Feb 12, 2021 | 11:18 AM

రైతుల్లో అత్యాధునిక పద్దతుల్లో పంట సాగు విధానాన్ని ప్రోత్సాహిస్తోంది. అన్నదాతలు ఉపయోగించే డీజిల్‌ ట్రాక్టర్‌లో మార్పులు చేసి.. తొలి సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఆవిష్కరించనుంది.

రైతుల అత్యాధునిక పంట సాగు విధానానికి ప్రోత్సాహం.. ఇవాళ సీఎన్‌జీ ట్రాక్టర్లను అవిష్కరించనున్న కేంద్ర మంత్రులు
Follow us on

India’s first CNG Tractor : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. రైతుల్లో అత్యాధునిక పద్దతుల్లో పంట సాగు విధానాన్ని ప్రోత్సాహిస్తోంది. అన్నదాతలు ఉపయోగించే డీజిల్‌ ట్రాక్టర్‌లో మార్పులు చేసి.. తొలి సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర మంత్రులు శుక్రవారం సీజీఎన్‌ ట్రాక్టర్‌ను లాంఛ్‌ చేయనున్నారు. రామ్యాట్‌ టెక్నో సొల్యూషన్‌, టొమాసెట్టో అచిల్లె ఇండియా సంయుక్తంగా సీజీఎన్‌ ట్రాక్టర్‌ను రూపొందించాయి. ఈ విధానం ద్వారా రైతులకు ట్రాక్టర్లపై వెచ్చించే ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు వారికి జీవనోపాధి మెరుగవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విధానంలో రైతులు ఏడాదికి ఇంధన ఖర్చులపై రూ.లక్ష రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

కాలుష్య నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రాక్టర్లను రూపొందించారు. తక్కువస్థాయిలో కాలుష్యమ ఉద్గారాలు ఉన్న స్వచ్ఛమైన ఇంధనం సీఎన్‌జీని వీటిలో వినియోగించనున్నారు. దీంతో ట్రాక్టర్ల ఇంజిన్‌ జీవిత కాలం పెరుగుతుంది. డీజిల్‌తో పోలిస్తే కాలుష్యం 70శాతం తక్కువని సంస్థ పేర్కొంది. భవిష్యత్‌ అంతా వీటిదేనని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల వాహనాలు ఇప్పటికే సహజ వాయువుతో నడుస్తున్నాయని, ప్రతి రోజు కొత్త కొత్త కంపెనీలు సీఎన్‌జీ ఉద్యమంలో చేరుతున్నాయని కేంద్ర స్పష్ఠం చేసింది.

ఇదీ చదవండి… అయోధ్య రామ మందిర నిర్మాణానికి వెల్లువెత్తుతున్న విరాళాలు.. నెలలోపే రూ.వెయ్యి కోట్లుః చంపత్‌ రాయ్‌