Petrol, Diesel Prices: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మళ్లీ పెరిగిన చమురు ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతోంది. చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధఱలు శుక్రవారం కూడా..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతోంది. చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధఱలు శుక్రవారం కూడా పెరిగాయి. వరుసగా నాలుగో రోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 39 పైసల వరకు పెంచాయి. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనదారుల నడ్డి విరుగుతోంది. ఒక రోజు నిలకడగా ఉన్నా.. మరుసటి రోజు పెరుగుతుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
తాజాగా లీటర్‌కు 39 పైసల వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.14పైసలు ఉండగా, డీజిల్ రూ.78.38 ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 91.65 ఉండగా, డీజిల్ రూ.85.50 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో పెట్రోల్ రూ. 94.64 ఉండగా, డీజిల్ రూ.85.32 ఉంది.చెన్నైలో పెట్రోల్ రూ.90.44గా.. డీజిల్ ధర రూ.83.52 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 91.09 ఉండగా, డీజిల్ రూ.83.09 ఉంది. ఏపిలోని పెట్రోల్ రూ.93.43 ఉండగా, డీజిల్ రూ.86.78 ఉంది.
కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. గత కొంత కాలంగా ప్రతి వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ధరలను పెంచుతూ వస్తోంది. మిగిలిన రెండు, మూడు రోజులు ధర పెరుగుదలలో మార్పు ఉండటం లేదు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులు చిల్లులు పడుతున్నాయి. అయితే దేశ అవసరాలను తీర్చేందుకు భారత్ దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని, మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగితే మనం కూడా ధరలు పెంచాల్సి వస్తుందని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు.
Also Read:
Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
Today Silver Price: తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..