ఒకప్పుడు హీరో హోండా రెండూ కలిసి ఒకే కంపెనీగా ఉన్నప్పుడు స్ల్పెండర్ అంటే ఫుల్ డిమాండ్. మంచి ఫ్యామిలీ ద్విచక్రవాహనంగా పేరు గడించింది. మంచి స్పెసిఫికేషన్లు, పనితీరుతో పాటు మైలేజీనిస్తూ.. తక్కువ ధరతో లభ్యమవుతుండటంతో అందరూ ఈ బైక్‌ని ఇష్టపడేవారు. ఆ తర్వాత కాలంలో హీరో, హోండా రెండూ విడిపోవడంతో స్ల్పెండర్ బైక్ హీరో కంపెనీ పరిధిలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ బైక్ వన్నె తగ్గలేదు. మార్కెట్లో అన్ని హీరో బైక్‌లతో పోల్చితే అధిక డిమాండ్ దీనికే ఉంటోంది. స్ల్పెండర్‌లో అనేక వేరియంట్లను కూడా హీరో కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం నాలుగు విభిన్న వేరియంట్లు మన దేశంలో అందుబాటులో ఉంది, స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్, సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ సూపర్ ఎక్స్‌టెక్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 73,400 నుంచి రూ. 89,232 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ క్రమంలో హీరో కంపెనీ ఈ స్ల్పెండర్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది హీరో కంపెనీ. పాత బండిని ఎక్స్‌చేంజ్ చేస్తే భారీగా బోనస్ ఇస్తామని ప్రకటించింది. అంతేకాక పలు విధానాలను అవలంభించడం ద్వారా ఈ బైక్ ధరను మరింత తగ్గించవచ్చు. అవేంటో చూద్దాం.
హీరో స్ల్పెండర్ బైక్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. అందుకోసం మీరు మీ పాత మోటార్‌సైకిల్‌ను మార్చుకోవచ్చు. అయితే కచ్చితంగా కండీషన్లో ఉండాలి. అప్పుడే మంచి రేటు వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైనా పాత బండిని ఎక్స్ చేంజ్ సమయంలో పాటించవలసిన కొన్ని సూచనలు మీకు అందిస్తున్నాం..
హీరో స్ల్పెండర్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్, సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ సూపర్ ఎక్స్‌టెక్. స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ రూ.73,440, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ రూ.79,703, సూపర్ స్ప్లెండర్ రూ.80,756, సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ రూ.85,154 ధరలకు లభిస్తున్నాయి. ఈ ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ మాత్రమే.
హీరో స్ల్పెండర్ ప్లస్ వేరియంట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. దీనిలో 97.2సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. దీని పవర్ అవుట్ పుట్ 8బీహెచ్‌పీ, టార్క్ 8.05ఎన్‌ఎం ఉంటుంది. మరోవైపు, హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్‌లో 124.70సీసీ, బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 10.72 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 10.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..